• YSRCP DMW, Vuyyuru Town

వెల్దుర్తి నుంచి 17వ రోజు ప్రజాసంకల్పయాత్ర


క‌ర్నూలు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ఆయన శనివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.


ఉదయం 8 గంటలకు వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్‌ వద్దకు చేరుకుంటారు.  ఈ యాత్రలో వైయ‌స్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు.  అనంతరం రాత్రి 7.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ బస చేస్తారు. ఈమేరకు 17రోజు పర్యటన వివరాలను వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య