• YSRCP DMW, Vuyyuru Town

వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలపై పోలీసుల కక్ష్య సాధింపు


దాచేపల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకుల పట్ల పోలీసులు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్షపార్టీకి చెందిన వారిపై అధికారపార్టీ నేతల కన్నుసన్నల్లో పోలీసులు కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్టేషన్‌లో ఉన్న కార్యకర్తలను పోలీసులు చితకబాదటంతో కార్యకర్తలు, నేతలు, మహిళలు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు. దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం బైఠాయించి నిరసనను తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే...వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ముత్యాలంపాడులో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను గత నెల27వ తేదిన కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లుతున్నారు. నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో యువకులు చల్లుకున్న గులాములు ఓ టీడీపీ నేత ఇంటి ఆవరణలో పడింది. దీంతో రెచ్చిపోయిన సదరు టీడీపీ నేత కర్రలతో వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా తోమ్మిదిమంది వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాడు. తమను టీడీపీ నాయకుడు కొట్టాడంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కూడా టీడీపీకి చెందిన 12మందిపై ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


వారం రోజులుగా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్న కార్యకర్తలు, నేతలు:

వైయ‌స్ఆ ర్‌సీపీ కార్యకర్తలు చింతారెడ్డి నరసింహరెడ్డి, మేడా నర్శిరెడ్డి, గుమ్మడి రమేష్‌రెడ్డి, ముడేల అంకిరెడ్డి, ముడేలా నరేంద్రరెడ్డి, కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, గుదిబండి నరసింహరెడ్డి, గుదిబండి పెద్దిరెడ్డి, గొట్టిముక్కల తిరుపతిరెడ్డిలపై కేసు నమోదు కావటంతో ప్రతి రోజు ఉదయం పిలిపించి రాత్రి వరకు స్టేషన్‌లో ఉంచి పంపిస్తున్నారు. గత నాలుగు రోజులు క్రితం వైయ‌స్ఆ ర్‌సీపీకి చెందిన మండల నాయకులు స్టేషన్‌కు వెళ్లి తమ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి కోర్టులో హజరుపర్చాలని పోలీసులను కోరారు. బెయిల్‌కు అవసరమైన పత్రాలను చూసుకున్న తరువాత కోర్టులో హజరుపర్చేందుకు పోలీసులు తాత్సరం చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్టేషన్‌కు చేరుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఎస్సై కట్టా ఆనంద్‌తో మాట్లాడారు. కేసు నమోదు చేసిన తరువాత ఎందుకు అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపించరని ప్రశ్నించారు. గురువారం కోర్టులో హజరుపరుస్తానని ఎస్సై నేతలకు చెప్పారు. గతంలో కుందుర్తి గురవచారీ మాదిరిగా పలు స్టేషన్లకు పంపించి కొడతారనే భయంతో కోర్టుకు హజరుపర్చేంత వరకు స్టేషన్‌ వద్దే ఉంటామని నేతలు ఎస్సైకు తేల్చిచెప్పి స్టేషన్‌ బయట ఉన్నారు.


స్టేషన్‌లో ఉన్న కార్యకర్తలను చిత‌క‌బాదిన‌ సీఐ  :

స్టేషన్‌కు బుధవారం రాత్రి గురజాల రూరల్‌ సీఐ ఆళహరి శ్రీనివాస్ వచ్చి టీడీపీ నేతలు పెట్టిన కేసులో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 9మందిని   వివక్షణరహితంగా చితకబాదారు. ఒకోక్కరికిని సీఐ ఇష్టనుసారంగ కొట్టారని, చేతులు వాసిపోయాయి. ఎమ్మెల్యే నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఐ తమ కార్యకర్తలను కొట్టారు., ఎమ్మెల్యే మెప్పు కోసం సీఐ ఈ విధంగా వ్యవహరించారు.


స్టేషన్‌ వద్ద బైఠాయించిన నేతలు, మహిళలు:

కార్యకర్తలను సీఐ శ్రీనివాస్‌ కొట్టటంతో నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముత్యాలంపాడు గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించారు. జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు షేక్‌ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, సర్పంచ్‌లు బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, పాలడుగు చినజానేసుతో పాటుగా మరికొంతమంది నేతలు స్టేషన్‌ వద్ద బుధవారం రాత్రి 11గంటల నుంచే బైఠాయించారు. కార్యకర్తలను పోలీసులు కొట్టారన్న సమాచారం ముత్యాలంపాడు గ్రామస్థులతో పాటుగా మండలంలోని నాయకులకు తెలియటంతో గురువారం తెల్లవారుజామునుంచే స్టేషన్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. ముత్యాలంపాడు నుంచి వందల సంఖ్యలో వచ్చిన మహిళలు స్టేషన్‌ ప్రధానగేట్‌ వద్ద బైఠాయించి సీఐకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. విష‌యం పార్టీ బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్‌ వద్దకు జంగా వచ్చారు. అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలతో జంగా మాట్లాడి జరిగిన ఘటన గురించి అడిగితెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న కార్యకర్తలను కలిశారు. సీఐ తమకు కొట్టారని, అరచేతులకు వాతలు పడ్డాయని కార్యకర్తలు జంగాకు చెప్పారు. కార్యకర్తల చేతులు కమిలిపొవటాన్ని గమనించిన జంగా చలించిపోయారు. స్టేషన్‌లో ఉన్న ఎస్సై ఆనంద్‌ను కలిసి ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. సీఐ దగ్గరుండి ఇంతటి దారుణంగా చితకబాదటం మంచి పద్దతికాదు.. మీ అరచకాలకు ఇంకా ఓపికపట్టలేం.. పిడుగురాళ్ల, గురజాల సీఐలు ఖాకీ యూనిఫాం వేసుకుని టీడీపీ నాయకుల్లా ఎమ్మెల్యేకు తోత్తులుగా వ్యవహరిస్తున్నారు....ఎమ్మెల్యే వద్ద మెప్పుపొందటం కోసం ఆయన ఏది చేయామంటే అది చేస్తున్నారు...రేపు ఎమ్మెల్యే ఫలనా వ్యక్తులను చంపమని చెబితే చెప్పేటట్లు వ్యవహరిస్తున్నారు..రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫారం వదిలిపెట్టి రాజకీయాల్లో రావాలి.. మీ సీఐ ఎంతమందిని కొడతారో చూస్తాం.. అని జంగా అన్నారు.


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య