• YSRCP DMW, Vuyyuru Town

ఊరూరా స‌మ‌స్య‌లు..ఇంటికో వ్య‌థ‌


  • నాలుగేళ్ల టీడీపీ పాల‌న‌లో అభివృద్ధి శూన్యం

  • సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌కు ఫిర్యాదులు

  • మంచి రోజులు వ‌స్తాయ‌ని ధైర్యం చెబుతున్న వైయ‌స్ జ‌గ‌న్‌

  • దిగ్విజ‌యంగా కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

అనంత‌పురం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప‌డింది. టీడీపీ పాల‌న‌లో ఏ ఒక్క‌రికి కూడా మేలు జ‌ర‌గ‌డం లేదు. ముఖ్య‌మంత్రి స్థాయి నుంచి గ్రామ‌స్థాయిలో ఉన్న ప‌చ్చ‌నేత‌లు పంచ‌భూతాల‌ను పంచుకుతింటున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా స‌మ‌స్య‌లే స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ఎవ‌రికి క‌దిలించినా..క‌న్నీళ్లు వ‌స్తున్నాయి. ఇంటికో వ్య‌థ‌..అడుగుకో బాధ వినిపిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. జ‌న‌నేత‌తో చిన్నపిల్లలు, మహిళలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు.  తమ అభిమాన నేత వస్తున్నారని ఆడ‌ప‌డుచులు రోడ్లపై ముగ్గులు వేసి, బంతిపూలు పరుస్తున్నారు. రైతులు, కూలీలు ప‌నులు మానుకొని ఎదురుచూస్తున్నారు. కాలేజీలు, పాఠశాలలకు విద్యార్థులు డుమ్మా కొడుతున్నారు. ఉద్యోగులు సైతం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొని త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. 


ఆప్యాయంగా ప‌ల‌క‌రింపు

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తున్నారు. దారిపోడువునా పంట పొలాల్లోకి వెళ్లి కూలీలు, రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఉద్యోగుల ఇబ్బందులు తొల‌గిస్తాన‌ని హామీ ఇస్తున్నారు. దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  మాట ఇస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమ‌వారం ధ‌ర్మ‌వ‌రం మండ‌లం దర్శనమల నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్థులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. నడిమిగడ్డపల్లి క్రాస్‌, బిల్వంపల్లి, నేలకోట, బుడ్డారెడ్డిపల్లి, ఏలుకుంట్ల మీదగా తనకంటివారిపల్లి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొన‌సాగుతుంది. దారిపొడువునా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు.


స‌మ‌స్య‌ల వెల్లువ‌

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ధ‌ర్మ‌వ‌రం మండ‌లంలో ప‌లువురు ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.


మా తమ్ముడికి రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదు. డ్వాకా రుణం మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. ఆ తర్వాత రూ.10 వేలు అప్పుగా ఇస్తామన్నారు. తీరా రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు పది మందికి తొలగించి ఒక్కరికే ఇస్తున్నారు. నువ్వు వైయ‌స్ఆర్‌సీపీ అంటూ రేషన్‌కార్డు కూడా తొలగించార‌ని చెప్పారు.  రుణ మాఫీ చేస్తామని రూ.3 వేలు అప్పుగా ఇచ్చార‌ని అరుణ‌మ్మ తెలిపారు.   ఊళ్లో స్టోర్‌ బియ్యం కిలో తక్కువ ఇస్తున్నార‌ని రావుల‌చెరువుకు చెందిన స్ర‌వంతి తెలిపారు. 


నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అప్పటి నుంచి అడుగుతున్నా.. వైయ‌స్ఆర్‌సీపీ అంటూ పింఛను ఇవ్వలేద‌ని అరుణ అనే మ‌హిళ వాపోయారు.  ఇలా ఎంద‌రో త‌మ బాధ‌లు జ‌న‌నేత‌కు చెప్పుకున్నారు. వీరంద‌రికీ అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య