• YSRCP DMW, Vuyyuru Town

ఉపాథి పనులు అవినీతి కంపు కొడుతున్నాయి


ప్రజా సంకల్పయాత్రలో భాగంగావైయస్ ఆర్ సీపీ  అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జ గన్ మోహన్ రెడ్డి శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.


అందులోని ముఖ్యాంశాలు

– ఉపాథి హామీ ఎలా అమలు అవుతోంది? పని దొరుకుతోందా?

 -  చంద్రబాబు చెప్పింది ఏదీ అమలు కావడం లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. రుణమాఫీ కూడా జరగలేదు. నమ్మి ఓటు వేశాం. మోసపోయాం. మళ్లీ ఆ తప్పు చేయం

4 నెలల నుంచి ఉపాథి హామీలో పని లేదు. పైసలు రావడం లేదు. కరువు పనులకు పోతే డబ్బులు ఇవ్వడం లేదు. 


వైయస్ జగన్ - 

ధరల స్థిరీకరణ నిధి రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ, ఆ తర్వాత ఏం చేశారు. మొత్తం దళారులకు అమ్మేశారు. ఎందుకంటే ఆయన కూడా ఒక దళారి కాబట్టి. ఆయనకు ఓ మార్కెట్‌ ఉంది. హెరిటేజ్‌ అని. దాని కోసం దళారులంతా ఒక్కటై.. తక్కువ ధరకు పంటలు కొంటున్నారు. అవి హెరిటేజ్‌కు చేరగానే, వాటి ధరలు పెరుగుతున్నాయి.

– పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రాలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? చెప్పండి. నాలుగేళ్లుగా బాబు పాలనలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు. వృద్ధులు, వికలాంగులు నా దగ్గరకొచ్చి గోడు చెప్పుకుంటున్నారు.

– జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోంది. పెన్షన్‌.. ఇంకా ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. మొత్తం వ్యవస్థ నాశనం అయిపోయింది.

– ఇవాళ రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ అమ్మడం లేదు. ఆ బియ్యం కూడా ప్రతి ఇంట్లో ఒకరికి కోత పెడుతున్నారు. అదే విధంగా చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అంత దారుణంగా పాలన చేస్తున్నారు.

– పొదుపు సంఘాల వారికి ఎన్నికలప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ, ఒక్కటీ అమలు చేయలేదు. ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. పొదుపు సంఘాల రుణం ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలన్నాడు. కానీ అదీ అమలు కాలేదు. రుణమాఫీలో ఇచ్చిన మొత్తం వడ్డీలకు కూడా సరిపోలేదు. అలా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడు.

– ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి దేశంలో ఎక్కడా జరగడం లేదు. అంతగా కంపు కొడుతోంది ఈ పథకం. వైయస్సార్‌ హయాంలో ఆ పథకం నిధుల్లో 97 శాతం కూలీలకు కేటాయించారు. దీంతో అందరికీ పనులు దొరికేవి. అందరికీ తిండి దొరికేది. కానీ ఇవాళ పనులను యంత్రాలతో చేస్తున్నారు. ఇదే డబ్బుతో సిమెంట్  రోడ్లు వేస్తున్నారు. సిమెంటు రోడ్లు వేయడం తప్పు కాదు కానీ, ఆ పేరుతో కూలీల కడుపు కొడుతున్నారు. అంత దారుణంగా మారింది ఈ ప్రభుత్వ పనితీరు. ఇక్కడి అవినీతి చూసి చివరకు కేంద్రం కూడా భయపడుతోంది.

– వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు చెబుతున్నాడు. మళ్లీ మనకు ఇలాంటి నేత కావాలా? ఆ ఎన్నికల్లో నమ్మించేందుకు బాబు.. ఇంటికో కిలో బంగారం, మారుతి కారు ఇస్తానంటాడు. కాబట్టి, ఇలాంటి రాజకీయాలు మారాలి. మంచి వ్యవస్థ రావాలి.

– లేచింది మొదలు లంచాలు ఎలా రాబట్టాలి? అన్నది తప్ప బాబుకు మరో ధ్యాస లేదు.

– ఒక్క ఏడాది ఓపిక పట్టండి. దేవుడి కరుణ, మీ ఆశీస్సులు తోడుగా ఉంటే మన ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతా మంచే జరుగుతుంది.

– మీ పిల్లలను బడికి పంపిస్తే, ఆ కుటుంబానికి ఏటా రూ.15 వేలు ఇస్తాను. ఈ మాట ప్రతి ఒక్కరికీ చెప్పండి.. ‘అన్న చెప్పాడని చెప్పండి’

– 45 ఏళ్లకే పెన్షన్‌. అది కూడా రూ.2 వేలు ఇస్తామని చెప్పండి. వైయస్సార్‌ పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించారు. మళ్లీ అలాంటి ప్రభుత్వం, పాలన వస్తుందని చెప్పండి.

– ఎన్నికల నాటికి పొదుపు సంఘాల రుణం ఎంత ఉంటే.. దాన్ని 4 విడతలుగా నేరుగా మీకే ఇస్తాం. బ్యాంకులకు ఇవ్వం. 

– సున్నా వడ్డీకే డబ్బులు రావాలి. కానీ ఇవాళ రావడం లేదు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించండి. బాబు ప్రభుత్వం ఆ వడ్డీ డబ్బులు కట్టకపోవడం వల్ల, సున్నా వడ్డీ అమలు కావడం లేదు. మేము అధికారం లోకి రాగానే దాన్ని కచ్చితంగా కడతాం. తద్వారా సున్నా వడ్డీ పథకం పక్కాగా అమలు అవుతుంది.

– మీ కోసం నవరత్నాలు ప్రకటించాను. సలహాలు, సూచనలు ఇవ్వండి. అవసరమైన మార్పులు చేస్తాను. కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటిస్తాను. చెప్పిన ప్రతిదీ అమలు చేస్తాం.

– దివంగత మహానేత హయాంలో ప్రాజెక్టుల పనులు 80 శాతం పూర్తి కాగా, ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక్కడే కృష్ణగిరి ప్రాజెక్టు ఉంది. దీంతో పాటు, గుండ్రేవుల ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాను. తెలుగుగంగతో పాటు, కెసి కెనాల్‌ ఆయకట్టును పూర్తిగా స్థిరీకరిస్తాను.

– ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు ఆగస్టు నుంచి వేతనాలు రావడం లేదు. మధ్యాహ్న భోజనం పథకంలో బిల్లుల రావడం లేదు. బాబు హయాంలో జీతాలు రావడం లేదు. బిల్లుల చెల్లింపు లేదు. ఉద్యోగ భద్రత కొరవడింది. అంతా దారుణంగా మారింది.

– నారాయణరెడ్డి గురించి మీకు తెలుసు. ఆయనను దారుణంగా చంపారు. హత్యలు చేసి భయపెట్టాలని చూస్తున్నారు.

– చంద్రబాబూ.. ఎమ్మెల్యేలను కొంటున్నావు. పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నావు. హత్యలు చేస్తున్నావు. ఇంకా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నావు. అలా పదవి కాపాడుకుంటున్నావు. కానీ ప్రజలు చూస్తున్నారు. పైన దేవుడు కూడా చూస్తున్నాడు. ఎన్నికల్లో డిపాజిట్లు  కూడా రావు. 

– ఇక్కడ (పత్తికొండ) నారాయణరెడ్డి భార్య శ్రీదేవి అమ్మను ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. ఆశీర్వదించండి.

– వీఆర్‌ఏలను మళ్లీ తీసుకుంటాం. ఆశ వర్కర్లకు న్యాయం చేస్తాం.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య