• YSRCP DMW, Vuyyuru Town

ఉచితంగా ఆపరేషన్‌ చేయిస్తాం..


  • ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్న వారికి నెల నెల డబ్బులిస్తాం

  • కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం

  • 104 ద్వారా అన్ని రకాల మందులు ఇస్తాం

  • మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వండి

  • టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుందో కనిపించడం లేదు

  • బాబు పాలనలో ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి

  • డోన్‌ను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

  • ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తీసుకొస్తాం

కర్నూలు: ఎటువంటి వ్యాధికైనా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ చేయించి, చిరునవ్వుతో ఇంటికి పంపిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పథకాలను చంద్రబాబు నీరుగార్చారని ఆయన మండిపడ్డారు. మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని ఆరోగ్య శ్రీ పథకాన్ని మెరుగు పరుస్తానని జననేత మాట ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 14వ రోజు వైయస్‌ జగన్‌ కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. మంగళవారం సాయంత్రం బేతంచర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాటల్లోనే..


–  ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఈ ఎండలో ఇక్కడ నిలవాల్చిన అవసరం లేదు. అయినా కూడా తీక్షణమైన ఈ ఎండను ఖాతరు చేయకుండా, నడిరోడ్డు అన్న సంగతి లెక్క చేయకుండా చిక్కని చిరునవ్వుతో ఆప్యాయతలు పంచుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఆత్మీయతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు.


– చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపుగా నాలుగు సంవత్సరాలు కావొస్తుంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి, సన్నద్ధం కావాలని చంద్రబాబే చెబుతున్నారు. ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనను చూశాం. మనకు ఎలాంటి నాయకత్వం కావాలి. మనకు ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నది అన్న విషయాలను మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.


– మీరంతా సినిమాకు వెళ్తారు కదా? సినిమాలో మీకు అబద్దాలు చెప్పి, మోసాలు చేసే విలన్‌ నచ్చుతారా? లేకపోతే 14 రీళ్ల సినిమాలో హీరో అనే వ్యక్తి ఇబ్బందులు పడుతుంటాడు. న్యాయంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఇటువంటి హీరో నచ్చుతాడా మీరే చెప్పండి. 


– రామాయణం, మహాభారతం, ఖురాన్‌ తీసుకున్నా అంతిమంగా నిజాయితీగా ఉన్న వ్యక్తే గెలుస్తాడని మనం చూశాం. సినిమాలో కూడా విలన్‌దే పై చెయ్యిగా కనిపిస్తుంది. 14వ రీల్‌లో మాత్రం హీరోనే గెలుస్తారు. విలన్‌ను హీరో ఫుట్‌బాల్‌ ఆడుతాడు.


– ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు ఆ రోజు అన్న మాటలు గుర్తుచు తెచ్చుకోండి. ఆ రోజు ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు మైక్‌ పట్టుకొని అన్న మాటలు ఏంటీ?


– ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తానన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఒక్క ఇల్లైనా కట్టించాడా?


– ఇవాళ ఇల్లు కావాలని అర్జీలు పెట్టుకుంటూ కళ్లు అరిగేలా తిరుగుతున్నారు. 


– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను మీరంతా చూశారు. ఇదే డోన్‌ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ ఎంతో మందికి ఇల్లు కట్టించారు.


– గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, కందిపప్పు, పామాయిల్, గోదుమ పిండి, చక్కెర, చింతపండు, కిరోసిన్‌ ఇచ్చే వారు. ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు.


– గతంలో కరెంటు బిల్లు ఎంత వచ్చేది. ఇవాళ చంద్రబాబు పాలనలో ఇంటికి రూ.500, 1000 చొప్పున వస్తుంది.  చంద్రబాబు ఎన్నికలకు ముందు కరెంటు బిల్లులు తగ్గిస్తానని మాట ఇచ్చారు. ఇంతదారుణంగా మోసం చేస్తున్నాడు.


– ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండు వేలు ఇస్తానని రెండు వేళ్లు చూపించాడు. ఇప్పటికి ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ ఉన్నాడు.


– చంద్రబాబు ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రూణాలన్ని మాఫీ చేస్తానన్నారు. ఆయన చేసిన రుణమాఫీ పథకం వడ్డీకే సరిపోలేదు.


– ఆడవాళ్లను మోసం చేయాలంటే ఎవరైనా నాలుగు సార్లు ఆలోచిస్తారు. ఆడవాళ్ల కళ్లలో నీరు చూడకూడదని ఆరాటపడుతారు. ఇదే చంద్రబాబు మీ రుణాలు అన్ని కూడా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?


– ఇన్ని దారుణాలు చేస్తున్నా ఈ వ్యక్తి, ఇన్ని మోసాలు చేస్తున్నా ఇలాంటి వ్యక్తిని పొరపాటున మళ్లీ ఎన్నుకుంటామా? 


– రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. అవసరం కోసం రాజకీయ నాయకులు ఏమైనా చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తులను వదిలేస్తే రేపొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు. అది కూడా సరిపోదు అనుకుంటే ప్రతి ఇంటికి మారుతి కారు కొనిస్తా అంటాడు. ఇలాంటి వ్యక్తులను వ్యవస్థ నుంచి పంపించాలి. విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావాలి.


– ఇదే నియోజకవర్గం పరిస్థితి చూడండి. ఇవాళ బేతంచర్ల, కొట్టాల, పలుకూరు, పాతపాడు గ్రామాల్లో నాపరాయి కలర్‌ స్టోన్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఒక యూనిట్‌ పెడితే దాదాపు 20 మందికి ఉపాధి దొరుకుతుంది. నాడు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. చంద్రబాబు రాకముందు పాలీష్‌ యూనిట్లకు కరెంటు బిల్లు వైయస్‌ఆర్‌ హయాంలో రూ.3.75 పైసలకు తగ్గించాడు. చంద్రబాబు సీఎం అయ్యాక దాన్ని రూ.8.75 పైసలకు తీసుకెళ్లాడు. ఇలా చేస్తే ఏ రకంగా వాళ్లు బతుకుతారు. చంద్రబాబు సీఎం కాగానే సీనరేజ్‌ చార్జీలు పెంచారు. స్వై్కర్‌ మీటర్‌కు రూ.55 పెంచారు. రాయల్టీ రూ.1000 కడుతున్నారు. పాలీష్‌ యూనిట్లు సగానికి పైగా మూతపడుతున్నాయి.


– ఎస్సీలు బ్యాంకుల్లో నుంచి అప్పులు తీసుకొని వచ్చి పాలీష్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ వారు రాయి అమ్ముకోలేక యూనిట్‌ను మూత వేసుకుంటున్నారు.


– చంద్రబాబు గొప్ప వ్యక్తి అట. ఈయన్ను చూసి సింగపూర్, జపాన్‌ నుంచి పరిశ్రమలు వస్తున్నాయట. కొత్తవి కథ దేవుడేరుగు, ఉన్నవి మూతపడుతున్నాయి.


– ఈ నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు లేదు. తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది.


– ఒక్కసారి నాన్నగారి పాలనకు గుర్తుకు తెచ్చుకోండి. నాడు గాజులదిన్నె నుంచి డోన్‌కు నీరిచ్చారు. కేఈ కృష్ణమూర్తి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవుకు నుంచి నీరు తెస్తానని ఆ పెద్ద మనిషి చెప్పారు. ఇంతవరకు నెరవేర్చలేదు. తాగడానికి నీళ్లు లేవు అంటే వినే నాథుడు లేడు. హంద్రీనీవాను తీసుకురావాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు.


– చాలా మంది రైతులు పెట్టుబడులు చేతికందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లి రైతులకు గిట్టుబాటు కావడం లేదు. రెండేళ్లుగా నష్టాల్లో ఉన్నారు. ఉల్లిని పొలాల్లోనే వదిలేస్తున్నారు. టమోటాలు ఎక్కువగా పండిస్తున్నారు. ఆ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మిర్చి, శనగ, మినుము, కంది ఏ పంట చూసినా కూడా గిట్టుబాటు ధరలు ఉండవు. దళారులు రైతుల వద్ద చౌకగా కొని ఆ తరువాత హెరిటేజ్‌ షాపులో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు.


– చంద్రబాబు కూడా ఒక దళారి కాబట్టే రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంతో పాటు చుట్టు ప్రక్కల రాష్ట్రాల్లో ఆయన హెరిటేజ్‌ షాపులు పెట్టారు. గత నాలుగేళ్లుగా రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేయడం, ఆయన షాపులో ఎక్కువకు అమ్ముకుంటున్నారు.


– బేతంచర్లలో 80 వేల మంది ప్రజలు ఉంటున్నారు. ఇక్కడ ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.


– మహానేత పాలనలో ఎవరికైనా ప్రమాదం జరిగినా 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేది. అవసరమైతే హైదరాబాద్‌కు కూడా తీసుకొని వెళ్లేవారు. ఇవాళ ప్రజలు కావ్‌ కావ్‌ అంటున్నా..108 అంబులెన్స్‌  రావడం లేదు. సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. వాహనానికి డీజిల్‌కు కూడా డబ్బులు ఇవ్వడం లేదు.


– రాష్ట్రం విడిపోయిన ఈ రాష్ట్రంలో మంచి ఆసుపత్రి ఎక్కడ ఉంది. ఏదైనా కూడా హైదరాబాద్‌లోనే ఆసుపత్రులు ఉన్నాయి. అయితే ఆరోగ్య శ్రీ కింద హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే డబ్బులు ఇవ్వడట. దారుణంగా ఆరోగ్యశ్రీని నీరుగార్చారు.


– ఇదే కర్నూలు స్వాతంత్య్ర దినోత్సవం నాడు చంద్రబాబు డోన్‌లో మైనింగ్‌ స్కూల్‌ పెడతామన్నారు. ఈ పాలన నుంచి విముక్తి రావాలంటే..


– రాజా నాకు మంచి స్నేహితుడు..ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఈ నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా చేస్తానని మాట ఇస్తున్నాను. హంద్రీనీవా నీళ్లు తీసుకొని వచ్చి చెరువులు నింపుతాను. బేతంచెర్ల పాలీష్‌ యూనిట్లలో చంద్రబాబు ఏవిధంగా నీరుగార్చారో..ప్రతికార్మిక సోదరుడికి చెబుతున్నాను. ఏడాది పాటు ఓపిక పట్టండి. మన హాయంలో మళ్లీ రూ.3.75 పైసలకే కరెంటు యూనిట్‌ ఇస్తాం. ఇక్కడి పాలీష్‌ యూనిట్లకు మేలు చేసే కార్యక్రమం చేపడుతాం.


– రాష్ట్రం నాలుగు అడుగులు వెనుకడుగులు వేస్తుంది కాబట్టి ముందడుగు కోసమే పాదయాత్ర చేస్తున్నాను. నవ రత్నాల్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులకు సలహాలు ఇవ్వమని కోరుతున్నాను. 


– నిన్నటి వరకు చదువు గురించి మాట్లాడాను. ఇవాళ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. మీ పిల్లలు చదువులు మానకూడదు. వారు చదివితేనే మన బతుకులు మారుతాయి. అమ్మ దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీ పిల్లలను నేను చదవిస్తాను. మీ పిల్లలను బడికి పంపించినందుకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని నిన్న చెప్పాను. ఇదొక్కటే కాదు మన పిల్లలు ఇంజనీర్లు చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చేది కేవలం రూ.35 వేలు మాత్రమే. మిగతా డబ్బు కోసం తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. మీ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నేను చదవిస్తాను. పిల్లలు ^è దివేందుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాను.


– ఇవాళ ఎవరికైనా గుండెపోటు వస్తే, క్యాన్సర్‌ వస్తే వైద్యం చేయించాలంటే రూ.6, 7 లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద ఆపరేషన్‌ చేయించాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోవడం లేదు.


– మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తిగా మార్చుతాను. 180 నంబర్‌కు ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో మీ ముందుకు వచ్చేలా చేస్తాను. ఎటువంటి ఆపరేషన్‌ అయినా సరే ఉచితంగా చేయిస్తాను, చిరునవ్వుతో ఇంటికి పంపిస్తాను. డాక్టర్‌ సూచనల మేరకు విశ్రాంతి సమయంలో కూడా డబ్బులు ఇస్తాం. కిడ్నీ పేషెంట్లు డయాలసిస్‌ చేయించేకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మారుస్తాను. కిడ్నీ రిప్లేస్‌మెంట్‌కు కూడా డబ్బులు ఇస్తాం. రూ.10 వేలు కిడ్నీ పేషెంట్లకు పింఛన్‌ ఇస్తాం. 


–104 నంబర్‌కు ఫోన్‌ కొడితే గ్రామాలకు వచ్చేలా చూస్తాం. మందులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మనం అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా చేస్తాం.


–ఈ అడుగులో అడుగు వేసే సమయంలో ప్రతి అంశంపై మీ నుంచి సలహాలు, సూచనలు ఇవ్వండి. మీ సమస్యలు వింటాను, రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోను రెండు పేజీల్లో రూపొందించి అనిన కూడా అమలు చేస్తాం. 2024 ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని మళ్లీ మీ వద్దకు వస్తాను. తోడుగా నిలువమని, మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నాను.


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య