• YSRCP DMW, Vuyyuru Town

సుబ్బమ్మ మరణానికి బాబే బాధ్యుడు


  • బెల్టుషాపుల రద్దు సంతకం ఏమైంది

  • ఫోన్‌ కొడితే మద్యం బాటిల్‌ వస్తుంది...

  • మీరు సంతకం పెట్టిన మినరల్‌ వాటర్‌ రావట్లేదు.. బాబూ

  • రుణమాఫీ చేస్తానని పెట్టిన సంతకం ఏమైంది

  • నేరం చేస్తున్న మీకు భారీ శిక్ష తప్పదు చంద్రబాబూ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు ప్రశ్నలు సందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా పత్తేపురం గ్రామంలో మద్యం షాపు రద్దు చేయాలని నిరసన తెలుపుతూ గుండెపోటుతో మృతి చెందిన ముదునూరి సుబ్బమ్మ మృతికి వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు. సుబ్బమ్మ మృతికి చంద్రబాబు కారణమన్నారు. మద్యం విక్రయాలను విచ్చల విడిగా ప్రోత్సహిస్తూ చంద్రబాబు లక్షల కుటుంబాల్లో చిచ్చుపెడుతూ పాలన చేస్తున్నాడన్నారు. బెల్టుషాపు రద్దు చేస్తానని సీఎం కాగానే సంతకం పెడతానని మీరు ఎన్నికలకు ముందు చెప్పారు. మొదటి సంతకాలకు అర్థమేమిటి ముఖ్యమంత్రి గారూ..? అని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఫైల్‌ మీద సంతకం పెడితే దాని అర్థం ఆ రోజు నుంచి రైతులందరికీ ఉచిత విద్యుత్‌ లభిస్తుందనే. కరెంటు బకాయిలు రద్దు అంటే మొత్తం కరెంటు బకాయిలు అన్నీ ఆ క్షణం నుంచే రద్దు అయ్యాయనే, కానీ మీరు పెట్టిన సంతకానికి అర్థాలు వేరు. రుణమాఫీ చేస్తానని చెప్పి రూ. 87.612 కోట్లు వ్యవసాయ రుణాలుంటే ఇప్పటికీ రూ. 12 వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. 


అదే విధంగా బెల్టుషాపులను రద్దు చేస్తానని సంతకం పెడితే.. రద్దు కాలేదు సరికదా.. గ్రామాల్లో నివాసాల మధ్య, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, స్కూళ్ల పక్కన మద్యం షాపులకు నాలుగు రెట్లు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం మీదే. మద్యం అమ్మకాల్లో చంద్రబాబు రికార్డులు బ్రేక్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నిన్నటి వరకు రూ. 11 వేల కోట్లకుపైగా మద్యం మీదే సంపాదించారన్నారు. గత సంవత్సరం రూ.13,640 కోట్లు సంపాదిస్తే.. ఈ ఏడాది ఇప్పటికే 17 వేల కోట్లు దిశగా పరుగులు తీస్తున్నారు. 


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య