• YSRCP DMW, Vuyyuru Town

రైతులను నట్టేట ముంచారు


బసిరెడ్డి , ఆర్‌ ఎస్‌ పెండేకల్లు

రుణమాఫీ కాకపోగా, ఎదురు రూ.25 వేలు చెల్లించమని అడుగుతున్నారు. మాకు రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా 30 వేల నుంచి తగ్గించి 6,7 వేలు మాత్రమే ఇచ్చారు. మూడేళ్ల లో ఒకసారి అది కూడా ఈసారి మాత్రమే ఇచ్చారు.


జగన్‌ మైహన్ రెడ్డి కల్పించుకుని గిట్టుబాటు ధర గురించి వాకబు చేశారు.

పత్తి క్వింటాళ్లు 3 వేలు, బుడ్డలు(శెనక్కాయలు) విత్తనం 6 వేలకు కొంటే 3 వేలు కూడా రావడం లేదు. బాబు హయాంలో వర్షానికి పోతే మొత్తం పోతాయి. బాబు వస్తే మొత్తం వరదలు కొట్టుకుపోవాలి, లేకుంటే, ఏమీ లేదు. 

అప్పిరెడ్డి, పాండురంగాపురం 

శ్రీశైలంలో 855 అడుగుల్లో నీటిని నిలవ ఉంచితే, రాయలసీమకు నీళ్లు వస్తాయి. ఈ  చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలో నాలుగు నదులు ఉన్నా సాగునీటి కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వరదలు వచ్చినప్పుడు నీళ్లు వదిలేముందు కట్టల పరిస్థితులను పరిశీలించే వారు లేరు. కొద్ది రోజుల క్రితం నీళ్లు వదలగానే గళ్లు పడ్డాయి. 

మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రైతు కూడా కాలువ గట్ల ముందు నిలబడి నీరు కావాలని అడగలేదు. గిట్టుబాటు ధరలు కావాలంటూ రోడ్డక్కలేదు . ఆయన ఆకస్మికమరణం రైతుల  దురదృష్టం.


నాగేశ్వరరెడ్డి, గోవందపల్లి  

నకిలీ విత్తనాలు, నకిలీ మందులు సరఫరా చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేయించడం లేదు. పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయితే అవుతున్నాయి కానీ, విచారణ చేయించడానికి మంత్రులు అడ్డం పడుతున్నారు. 

నంద్యాల డివిజన్ లో నకిలీ విత్తనాలు, మందులతో దాదాపు 600 ఎకరాల్లో పంట నష్టపోయాము.

అధికారులందరికీ శాంపిల్స్ ఇచ్చాము, కానీ అమ్మిన వారిపై చర్యలు మాత్రం లేవు.

 

హామీ: రైతుల జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి వారిని కట్టడి చేయాలి. వీటిని నివారించడానికి సమగ్రమైన వ్యవస్థను తీసుకువస్తాం. ఈ అంశాన్ని చాలా సీరీయస్ గా పరిగణిస్తాం. నకిలీ విత్తనాలు, ఎరువులపై లోతుగా విచారిస్తే చంద్రబాబు మంత్రివర్గంలోని వారి పేర్లే బయటకు వస్తున్నాయి. 


భాస్కరరెడ్డి,

లక్ష రూపాయల రుణం తీసుకుంటే, స్కేల్‌ ఆప్‌ ఫైనాన్సు  పేరుతో ఎకరానికి 12 వేలు ఇచ్చారు. బ్యాంకులో 7 వేలు మాత్రమే ఇస్తారు. లక్ష రూపాయలు రుణంలో స్కేల్‌ ఆప్‌ ఫైనాన్సు 60 వేలు మాఫీ చేసి , 40 వేలు నన్ను కటమన్నారు.  వడ్డీ మాత్రం కట్టాలి. నాలుగు విడతలుగా చెల్లించామని చెపుతున్నా నాకు కలిగిన ప్రయోజనం శూన్యం. మా గొంతు కోసారు, రైతులను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద చెల్లిస్తామంటున్న 12500 ను 20 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.


వెంకప్ప,  రాజన్న గ్రామం  తుగ్గలి మండలం

గతంలో 60 వేలు రుణం తీసుకున్న 3 సార్లు గన్నవరం పోయి టోకెన్లు తీసుకున్న దరఖాస్తు చేసుకున్నా ఒక్క రూపాయి మాఫీ కాలేదు, ఇన్‌ పుట్‌ సబ్సిడీ కాలేదు. బంగారు కూడా 80 వేలకు తాకట్టు పెట్టాను, పత్తి పూర్తిగా నష్టపోయాను. 


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య