• YSRCP DMW, Vuyyuru Town

రావణ.. నరకాసురుల్లా చంద్రబాబు పాలన


  • జగనన్నకు నీరాజనం పలుకుతున్న మహిళామణులు

  • ఆడవారిని తీవ్రంగా హింసిస్తున్న చంద్రబాబు

  • ముఖ్యమంత్రి మహిళా వ్యతిరేకి

  • ఆడవాళ్లను వేధించే తోడేళ్లంతా టీడీపీలోనే ఉన్నారు

  • వారికి సంకెళ్లు వేయకుండా సీఎం కాపాడుతున్నాడు

  • మహిళల మొహాల్లో చిరునవ్వు చూడాలంటే జగనన్న సీఎం కావాలి

  • స్త్రీ శక్తి అంతా ఏకమై రాజన్నరాజ్య స్థాపనకు కృషి చేయాలి

  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా

హుసేనాపురం: అన్న వస్తున్నాడని, తమ కష్టాలన్నీ చెప్పుకొని గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవడానికి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారని పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హుసేనాపురంలో జరిగిన మహిళా సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రావణాసురులు, నరకాసురులు కలిసి పాలిస్తున్నట్లు ఉందని విమర్శించారు. ఎక్కడ ఆడవాళ్లను గౌరవిస్తారో.. అక్కడ దేవతలు సంచరిస్తారని పెద్దవారు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు మహిళామణులను తీవ్రంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి నుంచి మారుమూల గ్రామాల్లో నివసించే మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మోసాలతో దగాపడిన రెండున్న కోట్ల మహిళలకు అండగా ఉండేందుకు మహిళలంతా పెద్ద ఎత్తున సదస్సుకు తరలివచ్చారన్నారు. 


చంద్రబాబు రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నాడు.. మద్యపానంతో ఆడవారి మంగళసూత్రాలను తెంచుతున్నాడు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌తో మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయని పోలీసుల రికార్డులే చెబుతున్నాయన్నారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని మహిళలందరికీ అర్థమైందన్నారు. ఆడవారిపై అఘాయిత్యాలు చేసేవారంతా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులేనని, రాష్ట్రంలో చింతమనేని, దేవినేని, కామినేని, అచ్చి, బుచ్చి, గాలి, ధూలి లాంటి తోడేళ్లంతా ఆడవాళ్లను వేధిస్తున్నా.. వారికి సంకెళ్లు పడకుండా చంద్రబాబు పాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


బాల్య వివాహాల్లో ఆంధ్రరాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. కల్తీ మద్యంలో అగ్రగామిగా ఉందంటే చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు.. బ్యాంక్‌ల్లో పెట్టిన బంగారం మీ ఇంటికి నడిచివస్తుందన్నాడు.. ఏ ఒక్కరింటికైనా బంగారం తిరిగివచ్చిందా అని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనలో డ్వాక్రా మహిళలు స్వయం శక్తిగా ఎదగాలని పావలా వడ్డీకే రుణాలు అందజేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు 50 ఓటర్లుగా ఉన్న మహిళలను మోసం చేశాడన్నారు. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు మహిళలంతా కలిసికట్టుగా జగనన్నను సీఎంను చేసుకోవాలన్నారు. రాజన్న రాజ్య స్థాపన కోసం స్తీ్ర శక్తి అంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఆడవారి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో అధిక ప్రాధాన్యం మహిళలకే ఇచ్చారన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు.      Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య