• YSRCP DMW, Vuyyuru Town

పవన్‌.. ‘అజ్ఞాత’వాసి


ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని దాగుడు మూత‌లు

– ప్రశ్నిస్తానని వచ్చి... ప్రశ్నగా మిగిలాడు

– మొక్కుబడి పోరాటాలు, ప్రకటనలు

– ఏ సమస్యపైనా కడదాకా పోరాడింది లేదు

– తానొస్తే సంఘ విద్రోహ శక్తులు వస్తాయంటూ కబుర్లు 

– బాబుపై జనాగ్రహాన్ని  చల్లార్చడమే పవన్‌ కర్తవ్యంl


ముఖ్యమంత్రి చంద్రబాబును.. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నిలదీసిన ప్రతిసారీ దానిని పరిష్కరించడానికి అజ్ఞాతవాసిలా వ్యవహరించిన పవన్‌ కల్యాణ్ చాలా సందర్భాల్లో ప్రజా సమస్యలపై నోరు మెదిపిన దాఖలాలు లేనేలేవు. వివాదాస్పద సంఘటనలు, విషాదాలు చోటు చేసుకున్న ఏ సందర్భాల్లోనూ గంటల వ్యవధిలో పవన్‌ కల్యాణ్ బాధితులను చేరుకున్నదీ లేదూ! కొన్ని సంఘటనల్లో చేసిన వాగ్ధానాలను కూడా  గాలికొదిలేశారు. విశాఖ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ దగ్గర నుండి సింహపూరి యునివర్సిటీ దాకా చూసుకున్నా, రాజధాని పొలాల నుండి, ఆక్వా పార్క్‌ వరకు అన్నీ మధ్యలోనే వదిలేసారు పవన్‌. ఇలా సమస్యల మీద మొక్కుబడిగా మాట్లాడటం అలా వెళ్లిపోవటం.. 


– ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకోవడం ఇదేనా?

ఉద్దానం కిడ్నీ బాధితులని కలిసి మాట్లాడిన పవన్‌ 15 రోజుల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇచ్చిన రిపోర్టు తీసుకుని ముఖ్యమంత్రిని కలుస్తానని అన్నారు. కానీ కలవలేదు. 48 గంటల డెడ్‌ లైన్‌ అన్నారు అది గాలికి వదిలేసారు. బాధితులకి మంచినీరు, బస్సుపాసులిస్తామని చంద్రబాబు ప్రకటించగానే పవన్‌ కల్యాన్‌ కిడ్నీ బాధితులను పట్టించుకోవడం మానేశారు. ఆ తర్వాత వారి పరిస్థితిపై ఆరా తీసిన దాఖలాలు లేవు.


– అమరావతి రైతులు కోర్టుకెళితే పవన్‌ వారి వెంట లేరే..?

ల్యాండ్‌ పూలింగ్‌ మీద రైతులని కలిసారు. రైతులకి ఇష్టం అయితేనే తీసుకోండి లేక పొతే పొరాడతా అన్నారు. ఆ తరువాత రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటే ఆ రైతులు కోర్టుకు వెళ్లారు. కానీ వారి పక్షాన పోరాడతానని చెప్పిన పవన్‌  ఎక్కడా కనిపించలేదు. 


– అగ్రిగోల్డ్‌ బాధితులకిచ్చిన హామీ ఏమైంది?

అగ్రిగోల్డ్‌ మీద సభ పెట్టి తాను మద్ధతు గా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని టాస్క్‌ ఫొర్స్‌ ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ఇప్పటి వరకు  ఆ పని చేయకపోయినా పవన్‌ ప్రశ్నించింది లేదు. 


ప్రత్యేక హోదా మీద ప్రశ్నిస్తానని తోక ముడిచారు

2015లో ప్రత్యేకహోదా కోసం ప్రధాన మంత్రి మోడీని రెండు రోజుల్లో కలుస్తా అన్నారు. ఇప్పటి వరకు కలవలేదు. పైగా తరువాత మోడీని అడిగే అంత అర్హత నాకు లేదు అని అన్నారు ఇదే పెద్ద మనిషి. ప్రత్యేక హోదా మీద డెడ్‌ లైన్‌ పెట్టే అంత స్థాయి లేదు అన్నారు.


– తుందుర్రు వెళితే సంఘ విద్రోహ శక్తులు వస్తారంట!

2016 అక్టోబర్‌లో ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ బాధిత గ్రామ ప్రజలని హైదరాబాద్‌ పిలిపించుకుని వారి సమస్యలు విని వెంటనే ప్రెస్‌ కాన్ఫరెన్సు ఏర్పాటు చేశారు. ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీని తుందుర్రు గ్రామం నుండి వెంటనే వేరే ప్రదేశానికి తరిలించాలని.. లేని పక్షంలో పార్టీలని కలుపుకుని పోరాటం చేస్తానని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది గడిచి సుమారు 8 నెలలు అవుతోంది. ఈ విషయం మీద జులై 31 న ఇచ్చిన ప్రెస్‌ మీట్‌లో నేను అక్కడికి వస్తే సంఘ విద్రోహ శక్తులు వస్తాయి అందుకే రాలేదు అన్నారు. ఏ నాయకుడు వెళ్ళినా రాని ఈ సంఘ విద్రోహ శక్తులు పవన్‌ వెళ్ళినప్పుడే వస్తారా? ఇలా ఎన్ని సమస్యల మీద సంఘ విద్రోహ శక్తుల మాట చెప్పి దాట వేస్తారో తెలియదు. 


– దక్షిణ భారత ఆత్మగౌరవ సభకు పిలుపిచ్చి తప్పుకున్నాడు.

2017 జనవరి గణతంత్ర దినోత్సవం నాడు ప్రత్యేక హోదా మీద నిరసన తెలిపిన యువత మీద పొలీసుల లాఠీ చార్జ్‌ కి నిరసనగా మార్చిలో విశాఖ పట్నం ఆర్‌.కే బీచ్‌లో ( దక్షిణ భారతీయుల ఆత్మ గౌరవ శాంతియుత నిరసన ) చేస్తామని  ట్వీట్‌ చేశారు.  తరువాత దాని మీద కనీసం మాట్లాడలేదు.


– చేనేతలకు అంబాసిండర్‌గా ఉంటానని జీఎస్టీ భారంపడితే నోరు మెదపలేదు

2017 ఫిబ్రవరి 20న మంగళగిరిలో చేనేత సత్యాగ్రహ సభకి వచ్చి చేనేతకు బ్రాండ్‌  అంబాíసిడర్‌గా ఉంటానని చెప్పారు.  చేనేతల సమస్యల మీద ప్రశ్నిస్తానని చెప్పారు. చేనేతలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా జనసేన అండగా ఉంటుందని చెప్పారు. ఆ సభ ముగిసిన కొన్ని రోజులకే జీయస్టీ విధానంలో చేనేతలకు తీవ్ర అన్యాయం జరిగింది. కానీ అంబాసిడర్‌గా ఉంటానన్న పవన్‌  జీయస్టీ విధానం ఎత్తి వేయాలని కనీసం ప్రెస్‌ నోట్‌ కూడా విడుదల చేయలేదు. 


– దళితులను సాంఘిక బహిష్కరిస్తే నెల తర్వాత సీఎంతో కలిసి... 

గరగప్రరులో దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేస్తే.. సమస్య మీద  మాట్లాడకుండా నెల తరువాత చంద్రబాబుని కలిసి ప్రెస్‌ మీట్‌ పెట్టి.. నేను అక్కడికి వస్తే సంఘ విద్రోహ శక్తులు వస్తాయి అందుకే రాలేదు అన్నారు.  పవన్‌  వెళితేన వారు ఎందుకు వస్తారో  అర్థంకాని ప్రశ్న? ఇంతవరకు సమాధానం లేని ప్రశ్న.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య