• YSRCP DMW, Vuyyuru Town

ప్రశ్నించడానికి మీరెవరు?


– ప్రశ్నిస్తున్నానంటూ కొత్తగా తెరపైకి వచ్చినట్లుగా పవన్‌ మాట్లాడుతున్నారు

– టీడీపీ– బీజేపీ పాలనలో పవన్‌ భాగస్వామి

– టీడీపీ పాలనలో తనకేం బాధ్యత లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు

– చంద్రబాబు ఎలా సమాధానం చెప్పాలో పవన్‌ అలానే చెప్పాలి

– ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడింది పవనే

– బాబును మళ్లీ సీఎం చేసేందుకే పవన్‌ కుయుక్తులు

– పవన్‌ సీఎం కాలేరు కాబట్టే ఓట్లు చీల్చేందుకు కుట్ర‌

– మీ వ్యక్తిగత జీవితం చూడాలా? పార్టీని అమ్ముకున్నది చూడాలా?

– హామీలు అమలు కానందుకు పవన్‌ను మేం కడిగి పారేయాలి

– ఏం చేసినా చివరకు న్యాయమే గెలుస్తుంది


హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార, ప్రతిపక్షాన్ని ఒకే గాటున కట్టి నిన్న వైజాగ్‌లో పవన్‌ కళ్యాణ్‌ చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.  కొత్తగా తెరపైకి వచ్చినట్లు ప్రశ్నిస్తున్నానంటూ పవన్‌ అతి తెలివిగా మాట్లాడారా? బాధ్యతగా మాట్లాడారా అని ప్రశ్నించారు. టీడీపీ– బీజేపీ పాలనలో పవన్‌ భాగస్వామి అని, ఈ నాలుగేళ్లలో జరిగిన అరాచకాలపై సమాధానం చెపాల్పిన బాధ్యత పవన్‌పై ఉందని, ప్రశ్నించాల్సింది తాము, ప్రజలమే అని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..వాసిరెడ్డి పద్మ మాటల్లోనే..


నిన్న వైజాగ్‌లో పవన్‌ రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాలపై మాట్లాడారు.  2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఊరూరా తిరిగింది మీరు కాదా?. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మీరే. ఈ పాలనలో మీరు భాగస్వామి. రెండు సినిమాల మధ్య విరామం అన్నట్లుగా మధ్య మధ్యలో పవన్‌ విమర్శించడం ఏంటి. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడింది మీరే. రాజధాని కట్టకపోవడానికి, పోలవరం కట్టకపోవడానికి మీరే కారణం. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కులను రాకుండా అడ్డుపడింది చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కాదా. వీటిలో పవన్‌ భాగస్వామ్యం లేదా? ఈ నాలుగేళ్ల పాటు నోరు మెదపకపోవడంలో ఆంతర్యమేంటి? ఇదేదో మీరు స్క్రిప్ట్‌ ప్రకారం అధికార పార్టీ, ప్రతిపక్షాలను రెండు మాటల్లో విమర్శించడం ఏంటి. 


ప్రశ్నిస్తున్నది మేమే..

పవన్‌ కళ్యాణ్‌ను అడగాల్సిన ప్రశ్నలు మా వద్ద ఉన్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలకు నేను బాధ్యుడిని, వీటిని అమలు చేయకపోతే ప్రశ్నిస్తా అన్నది మీరు కాదా? ప్రజల తరుఫున ప్రశ్తిస్తున్నది మేము. ఆ రోజు పొత్తు పెట్టుకోవడం, మద్దతు కోరడం పొరపాటు చేశానని ఏ రోజైనా అన్నారా?. సడన్‌గా ప్రశ్నిస్తున్నానని కోడి ఎప్పుడు కూస్తే అప్పుడు కాదండి. మిమ్మల్ని గట్టిగా అడగాల్సింది మేము, ప్రజలు. సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉన్నది పవన్‌. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. హైకోర్టులు తప్పుపడుతున్నాయి. నేరాల్లో, దళితుల పట్ల, మహిళల పట్ల దాడుల్లో ఏపీ నంబర్‌ స్థానంలో ఉంది. ఈ నాలుగేళ్లలో మీరు ప్రభుత్వాన్ని ఒక్కసారైనా సరే నిలదీశారా?. అధికార, ప్రతిపక్షాన్ని గాటున కట్టి విమర్శించడం ఎంతవరకు న్యాయం. అరాచకపాలన సాగుతుంటే నీ నోరు పెగల్లేదు. విచిత్రమైన దారుణమైన పనులు ఈ రాష్ట్రంలో సాగుతున్నాయి. ఎంఆర్‌వోలపై, మహిళా అధికారులపై నడిరోడ్డుపై దాడి చేస్తున్నారు. మహిళలు అంటే లేక్కSలేదు. రాజ్యాంగం అన్నది లెక్క చేయము అన్న పద్ధతిలో పాలన సాగుతోంది. 


ఈ ప్రభుత్వానికి కాపలాదారు మీరే కదా? 

చంద్రబాబు ప్రభుత్వానికి కాపలాదారు మీరే కదా అని వాసిరెడ్డి పద్మ పవన్‌ను నిలదీశారు.  నన్ను చూసి ఓట్లు వేయమని అడిగింది మీరే కదా? నాకేమి సంబందం లేదని ఇప్పుడు దులిపేసుకుంటే ఇదెక్కడి న్యాయం. నంద్యాల ఉప ఎన్నికలో రూ.200 కోట్లు ఖర్చు చేస్తే మీరు కళ్లు మూసుకున్నారా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చంద్రబాబు ఈ మూడున్నరేళ్లలో లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ డబ్బు ఏం చేశారు. అందులో మీకు వాటా ఉందా? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి కాపలాదారు మీరే కదా? . ఇవాళ ఆవేశంతో ఊగిపోయి వైజాగ్‌లో ఏం మాట్లాడారు. అన్నకు జరిగిన మోసానికి కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ చెప్పడం హస్యాస్పదమన్నారు. నాలుగేళ్లుగా ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం ట్యాబెట్లు వేసుకున్నారు. ప్రత్యేక హోదా లేదు, పోలవరం లేదు, రుణమాఫీ లేదు. ఉద్యోగాలు లేవు, ఎవరికి న్యాయం జరగలేదు ఇన్నాళ్లు మీ కడుపు ఎందుకు మండలేదు. అన్నగారికి న్యాయం చేసేందుకు కడపు మండినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలకు సేవ చేయాలంటే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదని పవన్‌ అంటున్నారు. ఆ రోజు అందరూ కలిసి ఎన్నికలకు వెళ్తేనే 18 శాతం ఓట్లు మాత్రమే సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి కాలేనని పవన్‌కు అర్థమైందని, ఆ స్థానంలో చంద్రబాబును కూర్చోబెట్టేందుకు పవన్‌ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ రోజు చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టేందుకు వత్తాసు పలికారు. ఈ రోజు అదే స్థానంలో కొనసాగించేలా ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా రాజ్యం ఓడిపోవడతే ఆ నాయకుడు అనుకున్నది చేయలేరు అని మీరు అన్నారు. తండ్రి ఆశయాల సాధనకు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. ప్రజారాజ్యం ఓడిపోయిన వెంటనే ఏడాదికే మీ పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేశారే. ముఖ్యమంత్రి కాలేదనే కదా ఈ పని చేసింది. నిన్న వైజాగ్‌లో మాట్లాడటం కూడా పవన్‌ అజ్ఞానానికి నిదర్శనం కాదా? వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడు అధికారులతో, మంత్రులతో ప్రమేయం లేదు. మహానేత మరణాంతం ఆయన పై కేసులు పెట్టారు. కుట్రలు చేసి జైల్లో పెట్టారు. వైయస్‌ జగన్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మాకు నమ్మకం ఉంది. మీరు ఎదుటి వ్యక్తులపై నిందలు వేసేలా మాట్లాడుతారా? అనేక కుట్రలను, డ్రామాలను ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తిపై విమర్శలు చేస్తారా? వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం గురించి మీతో అనిపించుకోవాల్సిన అవసరం లేదు. 


మీలో ఏం చూడాలి?

మీ వ్యక్తిగత వ్యవహారం చూడాలా? మీ పెళ్లిలా వ్యవహారం చూడాలా. రాజకీయ పార్టీని హోల్‌సెల్‌గా అమ్మేసింది చూడాలా? అని వాసిరెడ్డి పద్మ పవన్‌ను ప్రశ్నించారు.  ముందు ఏం చేయదల్చుకున్నారో మీ ముసుగు తొలగించుకోండి. ఓట్లు చీల్చేందుకు దొంగ దెబ్బ కొట్టే డ్రామాల నుంచి బయటకు రండి. అన్నింటికి మీరే బాధ్యులు, చంద్రబాబు మాదిరిగానే, మిమ్మల్ని నిలదీస్తాం. ప్రశ్నించే హక్కు పవన్‌కు ఎక్కడిది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో గొ్రరెల్లా కొనుగోలు చేస్తుంటే మీరు మద్దతు పలకడం లేదా? ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక వేల కోట్లు చేతులు మారుతుంటే దానికి సమాధానం చెప్పాల్సింది మీరు కాదా? ఓట్లకు కోట్లు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో కేసుల్లో దొరికిపోతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రతి వేలు చంద్రబాబు, మీ వైపు సమానంగా చూపుతున్నాయి. నాకు బాధ్యత లేదు, నేను ప్రశ్నిస్తునే ఉంటానని అంటే కుదరదు. నాలుగేళ్ల అరాచక పాలనకు, చంద్రబాబు పాపాలకు మీరు బాధ్యులు, దీనికి ప్రజలకు ఎట్లా సమాధానం చెబుతారో చెప్పండి?

మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.  వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలు ఒక్కసారి నమ్ముతారు. పదే పదే డ్రామాలు ఆడేవారిని ప్రజలు నమ్మరు. ఇదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకదు. పవన్‌ ఎన్ని డ్రామాలు వేసినా, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా మారినా ప్రజలు అన్ని గమనిస్తున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. పవన్‌ తన తీరును ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం, ధర్మం గెలుస్తుందని వాసిరెడ్డి పద్మ ఆశాభావం వ్యక్తం చేశారు.


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య