• YSRCP DMW, Vuyyuru Town

ప్రజాసంకల్ప యాత్ర 13వ రోజు షెడ్యూల్‌

Updated: Nov 20, 2017



కర్నూలు: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు షెడ్యూల్ ఇలా ఉంటుంది. 13వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు బనగాలనపల్లి నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. ఉదయం 8.30 గంటలకు ఆయన బాతులూరుపాడు చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 9.30 గంటలకు ఎన్నకొండ మీదుగా 10.30 గంటలకు హుశ్సేనాపురం చేరుకుంటారు. అంత‌కు ముందు ఉదయం 10 గంటలకు ఆయన మహిళ సదస్సులో పాల్గొంటారు. హుశ్సేనాపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హుశ్సేనాపురం నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. 3.30 గంటలకు ఆయన పాలుకూరు క్రాస్‌రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ.. సాయంత్రం 4 గంటలకు గోవిందదిన్నె చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు డోన్ నియోజకవర్గంలోకి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తోంది. బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద వైయ‌స్‌ జగన్‌కు డోన్ నియోజకవర్గ పార్టీ నేతలు, ప్రజలు ఘనస్వాగతం పలుకుతారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో మాట్లాడారు. రాత్రి 7.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ బస చేస్తారు. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య