• YSRCP DMW, Vuyyuru Town

ప్రజాసమస్యలపై రచ్చబండ..ప్రజలకు జననేత భరోసావేంపల్లి: పాదయాత్రను దిగ్విజయం చేసేందుకు వేలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని మధ్య వేంపల్లిలో వైయస్ జగన్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కష్టాలను వైయస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే....మొట్టమొదటి రచ్చబండ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. మన ప్రభుత్వం వస్తే ఒక సంవత్సరం తరువాత మన ఎస్సీ కాలనీకి ఏం చేయగలుగుతాం.. ఏం చేస్తే చిరస్థాయిగా ప్రతి ఇంట్లో కూడా నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి. ఏం చేస్తే ఆ పరిస్థితుల్లోకి పోతామనే విషయాలపై సలహాలు ఇవ్వండి.. సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజల సలహాలన్నీ వింటాను. ప్రజల చల్లని దీవెనలతో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు కచ్చితంగా ప్రతీ కార్యక్రమం చేస్తాను. పాదయాత్ర ముగింపు సమయానికి నవరత్నాల్లో కూడా మార్పులు చేస్తాం.ఎన్నికల సమయానికల్లా చంద్రబాబు మాదిరిగా బుక్‌లెట్‌లు ఇవ్వం. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టో నెట్‌లో ఎక్కడ కనబడదు. అన్ని మోసాలు కాబట్టి పుస్తకం కనిపించదు. 


మన మ్యానిఫెస్టో రెండు పేజీల్లో ఉంటుంది. గర్వంగా మ్యానిఫెస్టో చూపిస్తాం. అమలు చేసి నిరూపిస్తాం. చంద్రబాబు అధికారంలోకి రాకముందు మనకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది. అసలు కరెంటు బిల్లే కట్టాల్సిన పనివుండేది కాదు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మన ప్రభుత్వం వస్తే పూర్తిగా ఫ్రీగా కరెంటు అందజేస్తాం. 


చంద్రబాబు ముఖ్యమంత్రి కాకమునుపు వేంపల్లి ఎస్సీ కాలనీల్లో నాన్న హయాంలో అందరికీ ఇళ్లు వచ్చాయి. చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క ఇళ్లు అయినా ఇచ్చాడా. అందరికీ మాట ఇస్తున్నా. మళ్లీ దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది. ఇలా వచ్చి నేను కూర్చిని ఇల్లు లేనివారు చేతులు పైకి ఎత్తండి అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేకుండా అందరికీ ఇల్లు కట్టిస్తా.


నాన్న హయాంలో అందరికీ పెన్షన్లు వచ్చాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కొందరికి ఇస్తూ మరి కొందరికి ఎగ్గొడుతున్నారు. అవ్వా తాతలను చూసుకునేవాడే మంచి కొడుకు అవుతాడు. మంచి ముఖ్యమంత్రి అవుతాడు. అవ్వా.. తాతలను పట్టించుకోలేని ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీ అందరికీ మాట ఇస్తున్నా.. పెన్షన్‌ ఇవ్వడమే కాదు. దాన్ని రూ.2 వేలు చేస్తా..పొరబాటున చంద్రబాబు జగన్‌ చెప్పాడు కదా అని నేను రూ.2వేలు చేస్తానని చెప్పినా చెబుతాడు. 


ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రూ.2కిలో బియ్యమన్నాడు. ఆయన అలా అనగానే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రూపాయి 90పైసలకే బియ్యమన్నాడు. ఎన్నికల ముందు ఇలాంటి మాటలు చెబితే ఎవరూ నమ్మరు. అవ్వతాతలకు ఎంత ఇస్తే అంత మంచిది. బాబు రూ.2వేలు ఇస్తే మంచిదే. వారికోసం నేను మరింతగా పెంచుతాను.

...............................

వృద్ధురాలు: నా భర్త చనిపోయి 6 నెలలు అయ్యింది. ఆయనకు బతికిఉన్నప్పుడు పెన్షన్‌ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు పెన్షన్‌ ఇవ్వడం లేదు. నాకు కళ్లు కనిపించవు.. ఏ పనిచేయలేను... నన్ను మీరే ఆదుకోవాలి సారూ.. వైయస్‌ జగన్‌: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన, కౌరవ పాలన సాగుతుంది. ఇక దగ్గరకు వచ్చేశాం.. ఇలాంటి సమస్యలు ఉంటే కోర్టుకు వేద్దాం.. ఎమ్మార్వో ఆఫీసులో పని జరగదు కానీ కోర్టుకు వెళ్లి న్యాయంగా పోరాడుదాం.. మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.2 వేలు ఇస్తాం... –––––––––––––––– నిరుద్యోగ యువతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఒక ఊరుకు కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఏపీని నెంబర్‌ వన్‌గా నిలబెడతానని, ఇప్పుడు నిరుద్యోగంలో నెంబర్‌ వన్‌ చేశాడు అన్నా.. జాబు రావాలంటే బాబు పోవాలన్నా... వైయస్‌ జగన్‌: ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. జాబులకు ప్రత్యేక హోదా చాలా అవసరమైన అంశం.. రాష్ట్రంలో ఏ పరిశ్రమలు పెట్టాలన్నా.. రాయితీలు ఉంటేనే పెడతారు.  ––––––––––––––––––– రత్న, బీఈడీ: చంద్రబాబు ప్రతి ఏటా డీఎస్సీ వదులుతానన్నాడు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ మాత్రమే వదిలాడు. జాబ్‌ ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మా పరిస్థితి ఏంటి సార్‌ వైయస్‌ జగన్‌: 1.4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం డీఎస్సీ విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పాడు. ఇప్పుడు ఒక్క సంవత్సరం కూడా పరీక్షలు పెట్టలేదు. కనీసం నీ మాటలతోనైనా బుద్ధి వస్తుందేమో.. ఒక్క సంవత్సరం తరువాత ఆ ఖాళీలన్నింటికీ పరీక్షలు పెట్టిస్తా.. ––––––––––––––––– విద్యార్థిః ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తామంటే మా కాలనీవాళ్లం అప్లై చేశాం. 30మంది అప్లై చేస్తే ఒక్కరికి వచ్చింది. అది కూడ బ్యాంకువాళ్లు షరతులతో కూడిన డబ్బులిస్తామంటున్నారు.  వైయస్ జగన్ః ఓ సంవత్సరం ఓపిక పట్టండి. మన పాలనలో అందరికీ న్యాయం జరుగుతుంది. .................................. విశ్వం(విద్యార్థి) గుడిసెల్లో బతికే మమ్మల్ని వైయస్ఆర్ పక్కా ఇళ్లు ఇచ్చి డెవలప్ చేశారు. ఆయన వెళ్లిపోయాక ఆయనతో పాటే మళ్లీ మా అదృష్టం వెళ్లిపోయింది. దోమలు కుట్టి అనారోగ్యంతో చచ్చిపోతున్నారు. కాలనీ మొత్తానికి ఒక్క వీధిలైటు కూడ లేదు. మీరు రావాలన్నా...రాజన్న రాజ్యం రావాలన్నా... ....................................................... వృద్ధురాలు..ఇళ్లు లేక వానకు తడిసి అగచాట్లు పడుతున్నాం సార్...నాకు కడుపునిండా అన్నం పెట్టేవాళ్లు కూడ లేరు. వైయస్ జగన్ః అవ్వా, ఇలా ఎవరూ లేని వృద్ధులకోసం ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమాలు కట్టిస్తాం. దాంట్లో డాక్టర్లు, నర్సులుండేట్టు చేస్తాం. ఓ సంవత్సరం ఓపిక పట్టండి. అవ్వ మరీ ఇబ్బందిగా ఉంటే పులివెందులలో వృద్ధాశ్రమం ఉంది. అందులో జాయిన్ కండి. ............................................... డ్వాక్రామహిళః చంద్రబాబు ప్రభుత్వంలోకి రాకముందు వడ్డీలేని రుణాలిస్తానని చాలా వాగ్ధానం చేశాడు. ఇప్పుడు ఒక్కొక్కరితో 10వేలు వడ్డీ కట్టించుకుంటున్నాడు. అందరికో ఉద్యోగాలొస్తాయంటూ నమ్మబలికాడు. ఇంతవరకు ఒక్కటి కూడ నెరవేర్చలేదు. అన్నీ చేశామని చెప్పుకుంటున్నారే తప్ప ఏమీ చేయడం లేదు. మీరు వస్తేనే మాకు మంచి జరుగుతుంది. వైయస్ఆర్ లాగే మీరు చేస్తారని నమ్ముతున్నాం. మేమంతా మీ వెంటే నడుస్తాం. ................................................ స్టూడెంట్ః వైయస్ఆర్ 9 గంటలు కరెంట్ ఇచ్చారు. బాబు 7 గంటలు కూడ ఇవ్వడం లేదు. మళ్లీ మీరు రావాలి. పూర్వవైభం కావాలి మాకు. వైయస్ జగన్ః పగలి పూట 7 గంటలు కచ్చితంగా ఇస్తాం. సాధ్యాన్ని బట్టి ఇంకా పెంచుతాం.  ..................................... కళ్యాణిః యోగివేమన యూనివర్శిటీలో పీజీ చదువుతున్నా. మాకు ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగా రావడం లేదు సార్. వైయస్ఆర్ ఉన్నప్పుడు మాకు ఫీజుల బాధే ఉండేది కాదు. 4 సంవత్సరాల నుంచి రావడం లేదు. అప్లికేషన్ పెట్టినా రావడం లేదు.  వైయస్ జగన్ః మీ అందరికి ఒకటే గుర్తు చేస్తున్నా. నాయన ముఖ్యమంత్రి కాకముందు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలించారు. అప్పుడు కూడ ఇదే పరిస్థితి. 2, 3వేలు స్కాలర్ షిప్ అని ఇచ్చి దాన్ని కూడ గొప్పగా చెప్పుకున్నారు. నాన్నగారు వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ తో ప్రతి ఒక్కరినీ డాక్టర్లను, ఇంజినీర్లను చేశారు. ఆ కుటుంబంపై బరువు లేకుండా చూశారు. మనం వచ్చాక పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తాం. చదువుతో పాటు ఉండడానికి, తినడానికి ఇబ్బందులు లేకుండా మరో రూ.20 వేలు ఇస్తాం.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య