• Jampana Kondala Rao

నవరత్నాలు - వైయస్‌ఆర్‌ రైతు భరోసా


"5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతులందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50 వేలు ఇస్తామని చెబుతున్నాను.  ఏటా రూ.12500 ఒకే సారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తామని చెబుతున్నాను. మే నెలలో ఇస్తానని చెబుతున్నాను. నేరుగా రైతుల చేతికే ఇస్తాం. మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ బకాయిల్లో జమా చేసుకోకుండా రైతులకే ఇస్తాం. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఇస్తున్నాం. ఈ డబ్బుతో ఏం చేయాలో రైతు ఇష్టానికే వదిలేస్తాం. ప్రతి రైతుకు తోడుగా నిలబడతాం. వైయస్‌ఆర్‌ మాదిరిగా ఇస్తాం. కులం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం అర్హులందరికీ ఇస్తాం.


అసెంబ్లీ సమావేశాల్లో సోషియే ఎకనామిక్స్‌ సర్వే విడుదల చేసింది.86 శాతం చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.33 వేల కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చేలా చేస్తాం. రుణమాఫి పథకానికి చంద్రబాబు చేసింది ఏంటంటే అన్ని కోతలు పెట్టి చివరికి అన్నివిధాల మోసం చేసి కేవలం 11 వేల కోట్లు మాత్రమే, మేం చెబుతున్న రూ.33 వేల కోట్లు ఎక్కడో అర్థం చేసుకోండి. ఇది కాక రైతులను మళ్లీ సువర్ణయుగంలోకి తీసుకెళ్తాం. మళ్లీ సున్నా వడ్డీ, పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.


ఇది కాక రైతులకు రూ.3 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. రూ.2 వేల కోట్లతో కెలామిటి రిలిఫ్‌ ఫండ్‌ పెడతాం. కరువు, వరదలు వచ్చినప్పుడు తోడుగా ఉండేందుకు ఈ నిధులు వినియోగిస్తాం.  వీటన్నిటి ద్వారా రైతుకు తోడుగా నిలబడతాం. ఉత్పత్తి వ్యయంతగ్గిపోతుంది. వైయస్‌ఆర్‌ భరోసాతో రైతులను ఆదుకుంటాం. ప్రకృతి సహకరించక రైతులు నష్టపోయినప్పుడు కెలామిటి ఫండ్‌తో ఆదుకుంటాం" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య