• Jampana Kondala Rao

నవరత్నాలు - వైయస్ఆర్ ఆసరా పథకం


"డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు…పొదుపు సంఘాలకు తోడుగా ఆసరా పథకం తీసుకొస్తాం. జనాభాలో 50 శాతం మంది మహిళలే. మహిళా సాధికారిత కోసం డ్వాక్రా విప్లవం, పొదుపు సంఘాల విప్లవం మొదలైంది. 2009 నాటికి దేశంలోనే నంబర్ వన్ స్థానం మన ఏపీకి వచ్చింది. 2009లో మొత్తం డ్వాక్రా గ్రూపుల్లో 25శాతం మన రాష్ట్రం నుచే ఉండేవారు. మొత్తం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాల్లో దేశం మొత్తం మీద 50శాతం రుణాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.  రుణాలు చెల్లించడంలో అక్కెచెల్లెమ్మలు 98శాతం సిన్సియర్ గా కట్టేవారు. ఇదంతా వైయస్ఆర్ గారి కాలంలో. ఇవాళ ఇదే డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటని ఒక్కసారి చూస్తే…ఎన్నికల హామీగా బాబు రుణాలన్నీ మాఫీ అన్నాడు.


ఎవరూ బ్యాంకుల్లోకి వెళ్లి కట్టొద్దన్నాడు. ఒక్కరూపాయి కూడ మాఫీ చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు పుణ్యాన సున్నా వడ్డీపోయి అపరాధ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి క్యాపిటల్ అకౌంట్ రద్దు చేశారు. మొత్తం 13జిల్లాల్లో 6 జిల్లాల్లోని డ్వాక్రా, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కేంద్ర ప్రభుత్వం 7 శాతానికి డబ్బులు ఇస్తాయి. మిగిలిన 7 జిల్లాల్లో 12.5 నుంచి 14 శాతం వడ్డీకి బ్యాంకులు అప్పులిస్తాయి. బాబు రాకముందు వరకు సున్నావడ్డీకే రుణాలిచ్చేవారు. బాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 14వేల కోట్ల రూపాయల మీద 10శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు కడితే సున్నా వడ్డీకే రుణాలిస్తారు. కానీ, బాబు డ్వాక్రా , పొదుపు సంఘాలను నాశనం చేశారు. రూ. 14వేల కోట్లపై  సున్నా వడ్డీ పథకం తగ్గిపోయింది. ఉన్న సగం మంది డ్వాక్రా-పొదుపు సంఘాల మహిళలకైనా మేలు చేస్తున్నారా అంటే అదీ లేదు. పంగనామాలు పెట్టాడు. రుణాలు మాఫి అన్నాడు చేయకపోగా కొత్త పథం తీసుకొచ్చాడు.


క్యాపిటల్ ఇన్ ఫ్యూజన్ . బ్యాంకులకు డబ్బులిస్తారట. అక్కచెల్లెమ్మలకు అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేయాలట. ఎడం చేత్తో దోచేసి కుడిచేత్తో అప్పు ఇచ్చినట్టుంది ఈయన గారి పరిస్థితి. వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా అప్పుగా ఇస్తావున్నాడు. బాబు చేసిన మోసానికి , రూ. 14వేల కోట్ల రుణాలను  కట్టని పాపానికి ఇవాళ అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు రూ. రూపాయిన్నర, 2 కట్టాల్సి వస్తోంది. ఈ మూడేళ్లలో డ్వాక్రా, పొదుపు సంఘాలు బ్యాంకులకు కట్టింది అక్షరాల 7వేల500 కోట్లు. సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మేం వచ్చాక దీన్ని పూర్తిగా మార్చేస్తాం. ఊరువాడ పోండి…ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి. అన్న వస్తున్నాడు మంచి రోజులొస్తున్నాయని చెప్పండి. ప్రతి అక్కచెల్లెమ్మకు చెబుతున్నా.


ప్రస్తుతం మీకున్న రుణాలు కట్టుకుంటూ వెళ్లండి. ఈరోజు వరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎంత రుణం అయితే ఉంటుందో అంతే మొత్తాన్నిమేం అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాల్లో నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం. అక్షరాల రూ. 15వేల కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చి తోడుగా నిలుస్తాం. ఇవీగాక వాళ్ల కాళ్లమీద నిలబడేందుకు మళ్లీ సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం. ఎంతైతే కట్టాలో అదంతా బడ్జెట్ లో పెట్టి సంవత్సరం సంవత్సరం వచ్చేట్టుగా చేస్తాం. ఈ పథకం పేరు  వైయస్ఆర్ ఆసరా అని ప్రతీ ఒక్కరికి చెప్పండి. మహిళలను తన కాళ్ల మీద నిలబెడతాం. నాన్న గారు కలలుగన్నట్టుగా మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తామని చెప్పండి" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య