• Jampana Kondala Rao

నవరత్నాలు - ఫీజు రీయింబర్స్‌మెంట్‌


"చంద్రబాబు ఎప్పుడు అంటుంటారు..బీసీలపై ప్రేమ అంటుంటారు. కత్తెర్లు, ఇస్తిరీ పెట్టేలు ముస్టి వేసినట్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ కలలు కన్నారు. చదువు కోసం ఏ పేద వాడు ఇబ్బందులు పడుకూడదని కలలు కన్నాడు. కుటుంబం నుంచి ఒక్కడైనా డాక్టర్‌ కావాలి, ఇంజనీర్‌ కావాలని భావించారు. వైయస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్‌ ఇలా ఏం చదువుతావో చెప్పు అనే వాడు. ఇవాళ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిర్వీర్యం చేశారు. చంద్రబాబు కేవలం రూ.35 వేలు ఇస్తున్నాడు. మిగిలన పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నవ్వుతున్నారు. ఇవాళ ఊరువాడా చెప్పండి. పరిస్థితి మారబోతుందని చెప్పండి.


ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పూర్వవైభవం తీసుకొని వస్తా. చదువుకు ఎంత ఖర్చు అయితే అంతా పూర్తిగా నేనే భరిస్తా. నెల నెల విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తామని చెప్పండి. చదువుల విప్లవం తీసుకొని వస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకొని వస్తాం. ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. రాష్ట్రం విడిపోయినందుకు నష్టపోతారని నాడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరు గార్చారు. ప్రత్యేక హోదా కోసం ఎన్నేన్నో పోరాటాలు చేశాం. నిరాహారదీక్షలు, యువభేరీలు, ధర్నాలు చేశాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేశాం. ప్రత్యేక హోదా మర్చిపోని అంశం. దీన్ని సాధించేందుకు లౌక్యం, దౌత్యం, పోరాటంతో సాధిస్తాం. అవసరమైతే ఎంపీలతో రాజీనామా చేయించే కార్యక్రమం చేస్తాం. హోదా కోసం కచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదా తో పాటు పరిశ్రమలు తీసుకొని వస్తాం" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య