• Jampana Kondala Rao

నవరత్నాలు - మద్య నిషేధం


"మద్యంతో ఇంటింటా చిచ్చు పెడుతున్నారు. ఎన్నో జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. రోడ్ల మీద జరిగే ప్రమాదాలే కాదు..లక్షల ఇళ్లలో మానవ సంబంధాలు సర్వనాశనం అవుతున్నాయి. తండ్రి తాగుబోతు అయితే కుటుంబాలు దిక్కులేనివి తయారవుతున్నాయి. నేరాలు–ఘోరాలు ఎక్కువవుతున్నాయి. తాగడం మానేస్తే తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని అందరికి తెలుసు. అయితే ప్రభుత్వమే వీధి చివర మద్యం షాపు పెట్టి తాగిస్తోంది. మంచి నీటికి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ లేదు. ఎంత బీరు కావాలి, ఎంత విస్కీ కావాలో అని ప్రభుత్వంపై నివేదికలు ఉన్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే మద్యాన్ని ఆపొచ్చు.

మీ అందరికి ఒక్క ఉదాహరణ చెబుతున్నాను. 1960 నుంచి 1990 దాకా సిగరెట్‌ ఎక్కువగా తాగే వాడు. ఇవాళ ఆ సిగరెటు తాగే పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. పొగతాగడం వల్ల కలిగే నష్టాలను గ్రహించిన కోర్టు సిగరేటు ప్యాక్‌లపై డేంజర్‌ గుర్తులు వేయించింది. గట్టిగా ప్రచారం చేయడంతో పొగతాగే వారి శాతం తగ్గింది. మద్యాన్ని ఒకేసారి నిషేదిస్తే వారు వేరే మార్గం  వెతుకుంటారు. వేరే మార్గాలకు తావు లేకుండా మద్యం వల్ల కలిగే నష్టాలు తెలియజేయాలి. దశలవారిగా మద్యాన్ని నిషేదించాలి. మూడు దశల్లో నిషేదం చేస్తాం. మొదటి దశలో బెల్ట్‌ షాపులు మూసివేసిస్తాం. ప్రచారం చేస్తాం. మద్యం ధరలు అందుబాటులో లేకుండా పెంచుతాం..మద్యంతో వచ్చే నష్టాలపై ప్రచారం చేయిస్తాం. దూమపానంలాగా మద్యపాన ం నిషేదంపై ప్రచారం చేయిస్తాం. ప్రతి నియోజకవర్గంలో రియాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయిస్తాం. మూడో దశలో కోటిశ్వరులు మాత్రమే కొనుగోలు చేసేలా చేస్తాం.

పైవ్‌ స్టార్‌ హోటళ్లో మాత్రమే మద్యం లభించేలా చట్టాలు తీసుకొని వస్తాం. మద్యం తయారు చేసినా, అమ్మినా భారీ శిక్షణ ఉండేలా చట్టాలు మార్చుతాం. ప్రతి కుటుంబంలో చిరునవ్వులు చూడాలనే ఇలా చేస్తున్నాం. వారికి వారి కుటుంబంలో గౌర వం, అనురాగం పెంచడమే మన విధానమే అని చెప్పండి. ప్రభుత్వ ఖజాన తగ్గినా పర్వాలేదు. ప్రజల ఆనందం కోల్పోవడానికి వీలు లేదని అందరికి చెప్పండి. ఇలాంటి విధానం ప్రకటించడం వల్ల మనకు ఓట్లు పడవనే బయం ఉండవచ్చు. చేదు మందు ఇచ్చి, ఇంజక్షన్‌ ఇచ్చే డాక్టర్‌ పని రోగికి అర్థమైనప్పుడు, మద్యం నిషేదం కూడా అర్థం చేసుకుంటారు.  ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. అందరి సహకారంతో ఇది పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాను" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య