• Jampana Kondala Rao

నవరత్నాలు - అమ్మఒడి పథకం


"చదువుకునే పిల్లల కోసం అమ్మఒడి పథకాన్ని తీసుకొస్తున్నాం. నేను మాట్లాడుతున్నప్పుడు రైతులకు తోడుగా నిలిచిందేకు వైయస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం. మరి ఏ భూమి లేని పేదల సంగతి ఏమిటని చెప్పి నా మనసు ఒప్పుకోలేదు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఓదార్పు యాత్రకు పోయినప్పుడు చూశా. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు పిల్లల చదువు మాన్సిస్తున్నారు. అదేమని అడిగితే, తినడానికి డబ్బులుంటే కదాయ్యా చదవించడానికి అంటున్నారు. ఆ పరిస్థితి మారుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తల్లులకు చెప్పండి. పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడొద్దని చెప్పండి. పిల్లలను బడులకు పంపించండి. అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పండి.


బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 చొప్పున ఇంట్లో ఇద్దరికి నెలనెల వేయి రూపాయలు ఇస్తామని చెప్పండి. ఐదోతరగతి నుంచి పదో తరగతి దాకా రూ. 750చొప్పున ఇద్దరికి రూ. 1500 ఇస్తామని తల్లులకు చెప్పండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కొక్కరికి వేయి చొప్పున ఇద్దరికి నెలనెల రూ. 2వేలు ఇస్తామని చెప్పండి. ఆ తర్వాతి పై చదువులకు ఫీజు రీయింబర్స్ మెంట్  పథకంలో అన్న మార్పులు చేశాడు,  చదువుల కోసం భయపడొద్దని చెప్పండి" - వై.యస్ జగన్ మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు)


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య