• YSRCP DMW, Vuyyuru Town

నీతి లేని కొంగ..చంద్రబాబు దొంగ  • నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు

  • మాట తప్పే వారిని ఇంటికి పంపించాలి

  • అనంతపురం జిల్లా రౌడీ రాజ్యం..మాఫియా రాజ్యంగా మారింది

  • విజయభాస్కర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డిని పట్టపగలే చంపారు

  • రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు నాకు తోడుగా నిలవండి

  • మ‌ళ్లీ వ‌డ్డీ లేని రుణాలు పున‌రుద్ధ‌రిస్తా

అనంతపురం: నీతి లేని కొంగ, హమీలు అమలు చేయలేని చంద్రబాబు ఒక్కటే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు కూడా కొంగ జపం చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతుండగా మనకు ఎలాంటి నాయకుడు కావాలో మనసాక్షిని ప్రశ్నించాలని సూచించారు. అనంతపురం జిల్లా రౌడీ రాజ్యం, మాఫియా రాజ్యంగా మారింది మండిపడ్డారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు తనకు తోడుగా నిలవాలని వైయస్‌ జగన్‌ కోరారు. మరో ఏడాదిలో మీ కొడుకు, అన్న స్థానంలో ముఖ్యమంత్రిగా వస్తున్నానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళలకు భరోసా కల్పించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 33వ రోజు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. తనతో పాటు అడుగులో అడుగు వేసి, తనకు స్వాగతం పలికి ప్రేమానురాగాలు పంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.


దారుణమైన పాలన పోవాలని ఎదురు చూస్తున్నారు..

దాదాపుగా నాలుగేళ్ల టీడీపీ పాలనను మనమంతా కూడా చూశాం. మరొక్క సంవత్సరంలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబే చెబుతున్నారు. మీ అందరిని అడుగుతున్నాను. గుండెలపై చెయ్యి వేసుకొని మనకు ఎలాంటి పాలన కావాలని మన మనసాక్షిని అడగాలి. ఈ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నాను. దారుణమైన పాలన ఎప్పుడెప్పుడు పోవాలని ఎదురుచూస్తున్నాం.


ఎన్నికలకు ముందు ఏమన్నారు..

కరెంటు బిల్లులు విఫరీతంగా పెరిగాయి, వస్తునే కరెంటు బిల్లులు తగ్గిస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు హమీ ఇచ్చారని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. గతంలో కరెంటు బిల్లు రూ.50, 70 లోపే వచ్చేవి అన్నారు. ఇప్పుడు రూ.500, 700, 1000 చొప్పున వస్తున్నాయి.  కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. బాబు సీఎం కాకముందు చౌక దుకాణంలో బియ్యం, చక్కెర, కందిపప్పు వంటి 9 రకాల సరుకులు దొరికేవన్నారు. ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదన్నారు.అందులో కూడా కోత విధిస్తున్నారు. ఏమంటే వేలిముద్రలు పడటం లేదంటున్నారు. ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టించారా? ఎక్కడికి వెళ్లినా లేదు..లేదు అన్న సమాధానం వస్తోంది.


రెండేళ్లు చూపి మోసం చేశాడు..

జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల సమయంలో చంద్రబాబు రెండేళ్లు చూపి మోసం చేశాడని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ప్రతి ఇంటికి ఉపాధి, లేకపోతే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు. ఆ రోజు టీవీల్లో ఏం కనిపించింది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.ఇవాళ బ్యాంకు నోటీసులు ఇంటికి పంపిస్తున్నారు. రుణమాఫీ రైతులకు కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. పొదుపు సంఘాల రుణాలన్ని మాఫీ చేస్తామని బాబు మాట ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు.


ప్రత్యేక హోదానే సంజీవని

రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని వైయస్‌ జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని తెలిసీ కూడా ఇదే పెద్దమనిషి తన స్వార్థం కోసం తాకట్టు పెట్టారు. ఆ రోజు 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన వ్యక్తి మోసం చేశాడని ధ్వజమెత్తారు.


కొంగలాగే..బాబు నమ్మించారు

అనగనగా ఒక చెరువు ఉండేది. ఆ చెరువు నిండా చేపలుండేవి. ఆ చేపలపై కొంగకు కన్ను పడింది. విఫరీతంగా చేపలను తినేసింది. తరువాత కొంగ ముసలిది కావడంతో తినడం కష్టమైంది. ఆ తరువాత కొంగ చెరువు దగ్గరకు వచ్చి చేపలకు ఇలా చెబుతోంది...నేను ముసలిదాన్ని అయ్యాను, ఈ శేష జీవితాన్ని మీ కోసం పనిచేస్తానని చేపలను నమ్మించింది. చేపలన్ని కొంగ మారిందని నమ్మేశాయి. గతంలో చంద్రబాబు 9 ఏళ్ల పాలనను మనం చూశాం. ఇలాగే చంద్రబాబు 2014 ఎన్నికల్లో మనల్ని కూడా నమ్మించారు.  కొద్ది రోజుల తరువాత ఈ చెరువును ఖాళీ చేయబోతున్నారు. చేపల వారు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్తారు అని చెప్పింది. దీంతో చేపలు ఆందోళనకు గురై ఏం చేయాలి,  నీ అంతా అనుభవం లేదని కొంగను చేపలు ఆలోచనఅడిగాయి. కొంత సేపు ఆలోచన చేసినట్లు కొంగ నటించి..కొంత దూరంలో ఓ పెద్ద చెరువు ఉంది. అందులోకి తీసుకెళ్తానని నమ్మించింది. చంద్రబాబు చెప్పినట్లు ఆ కొంగ కూడా మోసం చేసింది. ఒకరో ఇద్దరో నా మీద ఎక్కండి నేను తీసుకెళ్లి ఆ చెరువులో విడిచిపెడతానని చెప్పింది. తీరా మధ్యలోనే ఓ రాయి మీద కొంగ ఆగి చేపలను తినేసింది. ఇదే చంద్రబాబు పాలన కూడా చూస్తున్నాం.  ఆయన రైతులను, పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలను తినేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకుంటున్న విద్యార్థులను తినేశారు. ఈ మధ్యకాలంలో స్కూల్‌ పిల్లలు నా వద్దకు వచ్చి నీతిలేని కొంగ, చంద్రబాబు దొంగ అని చెప్పారు.  చంద్రబాబు పాలన చూస్తే..నిజంగా పిల్లలు ఈ కొంగ కథ చెప్పుకోవడం నిజమే అనిపిస్తుంది.  మీకు ఎలాంటి నాయకుడు కావాలని, బాగా ఆలోచన చేయమని అడుగుతున్నాను. మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి కావాలా? ఆలోచించుకోండి.


వైయస్‌ఆర్‌ తపన కనిపిస్తోంది..

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో  హంద్రీనీవా పనులు దాదాపు 80 శాతం పూర్తి చేశారు. దాదాపుగా రూ.6 వేల కోట్లు ఖర్చు చేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలనే తపన కనిపిస్తుంది. మన ఖర్మ ఏంటో తెలుసా..చంద్రబాబు నాలుగేళ్లలో పిల్ల కాల్వలను పూర్తి చేయలేదు. దీంతో రైతులకు నీరు అందడం లేదు. నాలుగేళ్లుగా వరుసగా కరువు మండలాలుగా మారుతున్నాయి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? తుంగభద్ర ద్వారా హెచ్‌ఎల్‌సీ నీరు వస్తుంది. ఈ నీటిని  అడగలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తుంగభద్ర నుంచి సమాంతర కాల్వ తీసుకురావాలని వైయస్‌ఆర్‌ ఆలోచించారు. ఇదే ప్రాంతంలో చాలా మంది మహిళలు నా వద్దకు వచ్చి తాగడానికి నీరు లేదన్నా అని చెబుతున్నారు. పీఏబీఆర్‌ పైప్‌ లైన్‌ వెళ్తున్నా ఇక్కడ తాగడానికి నీరు ఇ వ్వడం లేదు. ఇదే రాప్తాడు నియోజకవర్గంలో మహానేత హయాంలో 30 ఎకరాల భూమిని ఆటో నగర్‌ కోసం కొనుగోలు చేశారు. నాన్నగారు చనిపోయారు. ఇవాల్టి వరకు ఈ భూమిని పంపిణీ చేయాలన్న ఆలోచన రావడం లేదు. 


పట్టపగలే హత్యలు..

టీడీపీ పాలన రౌడీ రాజ్యం, మాఫీయా రాజ్యం తయారైంది. పైన చంద్రబాబు ఇసుక నుంచి మట్టి దాకా, మైనింగ్, మద్యం, కాంట్రాక్టర్ల దాకా అవినీతే, బోగ్గు, రాజధాని భూములు, చివరకు గుడి భూములు కూడా వదలడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ శ్రేణులు గ్రామస్థాయిలో దోచేస్తున్నారు. ఇవాళ గ్రామాల్లో మరుగుదొడ్డి కావాలంటే లంచం ఇవ్వాల్సిందే. దోపిడీ ఈ మాదిరిగా జరుగుతుంటే, మరోవైపు ప్రత్యర్థులను తప్పించేందుకు హత్యలు చేస్తున్నారు. సోసైటీ అధ్యక్షుడిని తన కార్యాలయంలోనే పిలిచి చంపేశారు. ప్రసాద్‌రెడ్డిని చూశాం, తహశీల్దార్‌ కార్యాలయంలోనే హత్య చేయడం మన కళ్ల ముందే చూశాం. ఇటీవల బీసీ సెల్‌ కార్యదర్శి ధనుంజయ యాదవ్‌ను చంపడానికి కుట్ర పన్నితే వారు దొరికిన పరిస్థితి చూశాం. ఈ పరిస్థితి మారాలి. రాజకీయాల్లోకి నిజాయితీ, విశ్వసనీయ రావాలి. విశ్వసనీయ రావాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి తోడు కావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది.


మనం ఏం చేయబోతున్నామంటే..

దాదాపుగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. నష్టపోయిన అన్నదాతలకు, అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు పాదయాత్ర చేస్తున్నారు. ఉద్యోగాలు దొరక్క అవస్థలు  పడుతున్న పిల్లలకు అండగా ఉండేందుకు పాదయాత్ర చేస్తున్నారు. మనం అధికారంలోకి వస్తే చేయబోయే మంచి ఏంటీ అన్నది నవరత్నాల్లోని అంశాలను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇందులో మార్పు, చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వమని కోరుతున్నాను.

ముఖ్యమంత్రిగా వస్తున్నాను..

నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశాం. టీడీపీ ప్రభుత్వం రాకముందు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇవాళ అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. ఎన్నికల సమయంలో రుణాలు కట్టొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన మాటలు నమ్మడంతో ఇవాళ రెండు రూపాయల వడ్డీ చెల్లిస్తున్నారు. ప్రభుత్వం తరుఫున రుణ వడ్డీల లెక్కలు కడితే రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేవారు. చంద్రబాబు వచ్చాక ఈ డబ్బులు కట్టడం మానేశారు. ఇంతదారుణమైన పాలనను ఇవాళ అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు చెబుతున్నాను. వస్తున్నాడు మీ కొడుకు, మీ అన్న ముఖ్యమంత్రి స్థానంలో వస్తున్నాడని ధైర్యంగా చెబుతున్నాను.  అన్న, కోడుకు ముఖ్యమంత్రిగా వస్తే ఎంత మంచి జరుగుతుందో చూపిస్తా. మీ రుణాలు ఎంతైతే ఉన్నాయో ఆ రుణం మొత్తం నాలుగు విడతల్లో అక్క చెల్లెమ్మలకే చెల్లిస్తాం. ఎన్నికలు అయిపోయిన వెంటనే అక్క చెల్లెమ్మలు బ్యాంకులకు వెళ్లి మీ రుణాలు ఎంత ఉన్నాయో మీ చేతుల్లోనే రసీదులు పెట్టుకొండి. నేను సీఎం కాగానే మొత్తం మీ చేతుల్లో పెడుతానని మాట ఇస్తున్నాను. మీ తరఫున వడ్డీ డబ్బులు ప్రభుత్వమే బ్యాంకులకు కడుతుందని చెబుతున్నాను. ఈ పథకం కూడా నవరత్నాల్లో పెట్టాను, ఇందులో మార్పులు చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వమని కోరుతున్నాను. ఎవరైనా నన్ను కలువవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు అని పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, మీ బిడ్డను ఆశీర్వదించమని సెలవు తీసుకుంటున్నాను.


వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో చిదంబరం రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చే రారు. ఆయనకు పాపంపేట బ హిరంగ సభలో వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య