• YSRCP DMW, Vuyyuru Town

మహిళలతో జననేత ముఖాముఖి


బాబు పాలనలో అన్నీ మోసాలేనని చెప్పిన మహిళలు
  • మహిళలతో జననేత ముఖాముఖి

  • జననేతకు తమ గోడు చెప్పుకున్న అక్కచెల్లెమ్మలు

అనంతపురం: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడిక్డి ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలు నీరాజనాలు పలికారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలంతా జననేతను కలుసుకునేందుకు పరుగు పరుగునా వచ్చారు. అన్న అడుగులో తమ అడుగు కలిసేందుకు యువత, చిన్నారులు అంతా పాదయాత్రలో పాలుపంచుకున్నారు. ధర్మవరం నియోజకవర్గం బత్తులపల్లి మండలం రావులచెరువు గ్రామంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేత తెలుసుకున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎలాంటి హామీలిచ్చారు. ఇప్పుడు అవి నెరవేర్చారా లేదా అని అక్కచెల్లమ్మలను అడిగి తెలుసుకున్నారు. 


ఫీజు రియంబర్స్‌మెంట్‌ అందడం లేదన్నా..

లక్ష్మీదేవి: మా తమ్ముడు బీటెక్‌ చదువుతున్నాడు. చంద్రబాబు ఫీజు రియంబర్స్‌మెంట్‌ అంటున్నాడు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇచ్చే రూ. 35 వేలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. పంటలు పండక అప్పుల్లో చిక్కుకుపోయాం. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. రెండు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. డ్వాక్రాలో ఉన్నాను.. రుణమాఫీ చేస్తానని చెప్పి మూడు వేలు ఇచ్చాడు. పెన్షన్లు పది మందికి ఎగరగొట్టి ఒక్కరికి మాత్రమే ఇస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని రేషన్‌ కార్డు కూడా ఊడబెడుకుతున్నారు. 

–––––––––––––––––


బాబు వస్తే బతుకు అంధకారమైంది..

వృద్ధురాలు: చంద్రబాబు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మా బతుకులు అంధకారమయ్యాయి. పొదుపు సంఘాల్లో రూపాయి రుణం కూడా మాఫీ కాలేదు. సున్నా, పావలా వడ్డీ కూడా ఇవ్వడం లేదు. బ్యాంక్‌లో ఉన్న బంగారం అట్లే ఉంది. వేలం వేస్తామని నోటీసులు వస్తున్నాయి. 

–––––––––––––––––––––


నాలుగేళ్లుగా పెన్షన్‌ అందడం లేదు..

అరుణ: నా భర్త చనిపోయి నాలుగేళ్లు అవుతున్నా.. పెన్షన్‌ ఇవ్వడం లేదు. అధికారులను, జన్మభూమి కమిటీలను అడిగితే మీరు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి పెన్షన్‌ ఇవ్వం అని ఇంటికి పంపిస్తున్నారు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడిని బడికి పంపించాలి. ఇంట్లోకి వెళ్లదీసుకోవాలి. నేను ఎలా బతకాలన్నా..

–––––––––––––––––


కేజీ బియ్యం పట్టుకొని ఇస్తున్నారు.

వృద్ధురాలు: చంద్రబాబు వచ్చినప్పటి నుంచి బియ్యం ఇవ్వడం లేదు. ఏమంటే వేలిముద్రలు పడడం లేదని పంపిస్తున్నారు. రేషన్‌ షాపుల్లో కేజీ బియ్యం పట్టుకొని ఇస్తున్నారు. చాలా అన్యాయం జరుగుతుంది. పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు. నాపేరు కంప్యూటర్‌లో ఎక్కిస్తున్నారు. తీసేస్తున్నారు.

––––––––––––––––––––––


రూ.20 లక్షలు దోచుకుతిన్నారన్నా..

ధర్మవరం టౌన్‌ సమ్యాఖ్యకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారిని ఒక్కరిని కూడా రానివ్వడం లేదు. ఏదైనా అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. టీఐఎఫ్‌లో రూ.20 లక్షల స్కాం జరిగింది. బాబమ్మ అనే ప్రెసిడెంట్‌ రూ.20 లక్షలు తినేసింది. ఎక్కడికి పోయింది సొమ్మని అడిగితే ఎవరూ స్పందించడం లేదు. కెనరా బ్యాంక్‌ను మొత్తం టీడీపీ నేతలు దోపిడీ చేశారు. తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే రుణాలు, ఇల్లు ఇస్తున్నారు. 

––––––––––––––––––––


నా ఉద్యోగం తీసేశాడు..

ఆశావర్కర్‌: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2006లో ట్రైనింగ్‌ ఇచ్చి ఆశావర్కర్‌గా తీసుకున్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నాం. బత్తులపల్లి మండలంలో 45 మంది ఆశావర్కర్లం ఉంటే అందులో ముగ్గురు వైయస్‌ఆర్‌ సీపీ వారిమని ఉద్యోగం నుంచి తీసేశారు. బాబు వస్తే జాబు అన్నారు. కానీ నాకున్న జాబు తీసేశారు. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య