• YSRCP DMW, Vuyyuru Town

క‌ష్టాలు విని..క‌న్నీళ్లు తుడిచి


 – ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని అన్నదాతల ఆందోళన

– మీరొచ్చాక అండగా నిలవాలని వినతి

– తోడుగా ఉంటానని మాట ఇచ్చిన వైయస్‌ జగన్‌   

కోడుమూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం రైతులకు శాపంగా మారిందని కర్నూలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువులు రైతులు తమ కష్టాలు చెప్పుకొని కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా వారి కన్నీళ్లు తుడిచిన వైయస్‌ జగన్‌ ..రైతుల కష్టాలు సావధానంగా విన్నారు.  పలువురు రైతులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఇలా ఉన్నాయి..

వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో వ్యవసాయం పండుగ:  రామచంద్రారెడ్డి, నంద్యాల మండలం, భీమవరం గ్రామం

– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎంతో కష్టకాలంలో ఉన్నారు. రైతే రాజు అని గొప్ప మాటలు చెప్పుతున్నారు. రైతులను పట్టించుకోవడం లేదు. రైతుల కష్టాలు ఇందిరాగాంధీ భూ సంస్కరణ నాటి నుంచే ప్రారంభమయ్యాయి. ఆ తరువాత టీడీపీలో కూడా అలాగే కొనసాగాయి. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు సుభీక్షంగా ఉన్నారు. మహానేత రైతులకు అండగా ఉంటు ..వ్యవసాయాన్ని పండుగలా చేశారు. ప్రతిపక్షాలు అన్ని కూడా నాడు ధరలు పెరిగాయని గగ్గోలు పెడితే రైతులకు మద్దతు ధర లేకుంటే ఎలా అని ఆనాడు వైయస్‌ఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు మినుములు, శనగలు, కందులు కొనుగోలు చేసే నాథుడు లేడు. మిర్చికి, పత్తికి రూ.7 వేల మద్దతు ధర వస్తే తప్ప రైతులు బాగుపడరు. ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోవడం లేదు. స్వామినాథన్‌ సిపార్సులు అమలు చేయడం లేదు. వైయస్‌ఆర్‌ మరణం రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్‌ జగన్‌: ఇవాళ మీరు కర్నూలు జిల్లాకు చెందిన రైతు కదా. పత్తి, ఉల్లి, కంది, టమోటలు, శనగ పంటలు ఈ ప్రాంతాల్లో ఎక్కువ పండిస్తున్నారు. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయని అడుగుతున్నాయి.పూర్తిగా వైరస్‌ వచ్చి పంటలు పండటం లేదు. ఏ రకంగా బతుకుతారు. ఇటువంటి పత్తికి రేటు ఎంత అని చూసే రూ. 3 వేలు. పత్తికి పెట్టుబడి రూ.30 వేలు .రైతులకు కేజీకి రూ.2 వస్తుంది. అదే చంద్రబాబు షాపులో కేజీ రూ.50 అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి దాళారి అయితే రైతుకు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది. మన ఖర్మ కొద్ది ఆయనే షాపుల్లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు.  ఉల్లి సాగు చేయడం ఇష్టం లేక పంటలను పొలల్లోనే వదిలేస్తున్నారు. టమోట రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. 25 కేజీల బాక్స్‌ రూ.100 కొంటున్నారు. హెరిటేజ్‌ షాపులో రూ.40 కేజీ చొప్పున అమ్ముకుంటున్నారు. ఇవాళ టమోటలను రైతులు రోడ్ల మీద పడేస్తున్నారు. రైతులకు తోడుగా ఉండాల్సిన ఈ వ్యక్తి రైతులను పోలీసు స్టేషన్‌లో పెట్టిస్తున్నారు.

–  వేరు శనగ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. క్వింటాల్‌ రూ.3 వేలు ఉంది. ఇదే వేరు శనగ హె రిటేజ్‌ షాపులో కొంటే కేజీ రూ.150 చొప్పున అమ్ముతున్నారు. 

–శనగల రేటు ఎంత అని అడుగుతున్నాను. క్వింటాల్‌ రూ.3 వేల నుంచి 4 వేల వరకు కొంటున్నారు. హెరిటేజ్‌ షాపులో ఇదే శనగలు కేజీ రూ.180 చొప్పున అమ్ముతున్నారు. రేటు తేడా ఎంతా అని అడుగుతున్నాను.

– కంది రేటు ఎంత? రూ.2500 నుంచి రూ.3 వేలు మద్దతు ధర ఉంది. ఇదే హెరిటేజ్‌ షాపులో కేజీ కంది రూ.80 చొప్పున అమ్ముతున్నారు. రైతుల వద్ద కేజీ రూ.25 చొప్పున కొనుగోలు చేసి రూ.80 చొప్పున అమ్ముతున్నారు.

రైతు: పత్తి రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. కౌలు కాకుండానే రూ.40 వేల దాకా వస్తుంది. ఉల్లి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు ఉంది. 

– మహానేత పాలనలో పత్తి క్వింటాల్‌ రూ. 8 వేలు చొప్పున కొనుగోలు చేశారు. అప్పుడు డీఏపీ బస్తా రూ.400, ఇప్పుడేమో రూ.1200 చొప్పున అమ్ముతున్నారు. పోటాష్‌ ఆ రోజు రూ.200 ఈ రోజు రూ.800 బస్తా అమ్ముతున్నారు.

– మిర్చి రేటు రూ.2500 నుంచి రూ.5000 ధర ఉంది. వైయస్‌ఆర్‌ హయాంలో మిర్చి రేటు క్వింటాల్‌కు రూ.8 వేలు ఉంది. 

– ఇవాళ కంది, మినుము, పెసర ధరలు రూ. 3 వేల లోపు ఉన్నాయి. ఆ రోజు రూ. 8 వేలకు అమ్ముకున్నారు. ఆ రోజు రైతుకు మద్దతు ధర వచ్చింది.

– పసుపు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు ధర ఉంది. ఆ రోజు రూ.13000 నుంచి 14 వేల ధర ఉండేది. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు.

– వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టి పగలు పూట రైతులకు 7 గంటలు కరెంటు ఇస్తామని ప్రకటించడంతో అప్పుడు చంద్రబాబుకు ట్యూబ్‌లైట్‌ వెలుగుతోంది. ఆ తరువాత 7 గంటల కరెంటు ఇస్తున్నారు. అది కూడా ఎప్పుడంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు కరెంటు ఇస్తున్నారు.

– గాజుల దిన్నే, తుంగభద్ర పై ఆధారపడి ఉన్నాయి. ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉంది.

––––––––––––––––––––––

రైతుల వద్ద తక్కువకు కొంటున్నారు:  రఘురామిరెడ్డి, రైతు, మిడ్తురు

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తక్కువ ధరకు కొంటున్నారు. తీరా దళారులు అమ్ముకునే సమయానికి రేట్లు పెంచుతున్నారు.  శనగలు జనవరిలో 9 వేలు ఉన్నాయి. ఈ రోజు నాలుగు వేలకు వచ్చింది. రైతుల వద్ద కొనుగోలు చేసే సమయంలో రేటు తక్కువ ధర ఉంటుంది. దళారులు కొనుగోలు చేసే సమయంలో రేట్లు పెంచుతున్నారు. మొక్కజొన్న, మినుముకు ధరలు లేవు. మొక్కజొన్న పరిస్థితి దారుణంగా ఉంది. మొక్కజొన్న క్వింటాల్‌ రూ.1100 కొంటున్నారు. చంద్రబాబే పెద్ద వైరస్‌గా మారాడు. ఈ చంద్రబాబు మళ్లి వస్తే రైతులు నాశనం కావాల్సిందే. నా ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ జగనన్న వెంటే ఉంటా. మీరు సీఎం కావాలన్నా..

–––––––––––––––––––––

ఏ కులం అని అడుగుతున్నారు:  రంగమ్మ, బుడగజంగాల 

ప్రస్తుతం మాకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. పిల్లలను చదివించాలంటే ఏ కులం అని అడుగుతున్నారు. మీరే చదివించాలన్నా..భూములు లేవన్నా..ఊర్ల వెంట తిరుగుతున్నాం.

––––––––––––––

నీటి సమస్య తీర్చండన్నా..: భాస్కర్‌రెడ్డి, కోడుమూరు

మా నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. హంద్రీనీవా నుంచి గాజుల దిన్నే ప్రాజెక్టుకు ఒక టీఎంసీ నీరు విడుదల చేయాలి. గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలి. పాలకుర్తిలో చెరువు  అక్రమణకు గురైంది. గిట్టుబాటు ధరలేదు. ఉల్లి రైతుల వద్ద లేదు. ఇప్పుడేమో క్వింటాల్‌ రూ.15 వేల చొప్పున కొంటున్నారు. మా వద్దనేమో రూ.2 వేల కు కొన్నారు. నాకు బ్యాంకులో రూ.60 వేలు అప్పులు ఉన్నాయి. రుణాలు మాఫీ కాలేదన్నా..

–––––––––––––––––––

చంద్రబాబు రైతులకు చేసింది ఏమీ లేదు

2016–2015 సబ్సిడీ ఇంతవరకు నా ఖాతాలో పడలేదు. ఎన్నిసార్లు బ్యాంకుకు వెళ్లినా కూడా డబ్బులు రాలేదని చెబుతున్నారు. అదే రాజశేఖరరెడ్డి పాలనలో ఒకేసారి రుణాలు మాఫీ అయ్యారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఒకేసారి మన రుణాలు మాఫీ అవుతాయని నమ్ముతున్నాను. నాలుగేళ్లలో చంద్రబాబు రైతులకు ఏమీ చేయడం లేదు. 

–––––––––––––––––––––

ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చి మరిచారన్నా..: వెంకటేశ్వర్లు, ఈ. తాండ్రపాడు

నేను చంద్రబాబును కర్నూలులో కలిశాను. నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ఇల్లు లేదు. నాకు ఇల్లు కట్టించాలని కోరితే నాడు సరే అని మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఆడబిడ్డలతో ఎలా బతకాలన్నా అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. స్పందించిన వైయస్‌ జగన్‌ అతని కన్నీళ్లు తుడిచారు. మన ప్రభుత్వం వస్తుంది, అధైర్యపడోద్దని భరోసా కల్పించారు. 

–––––––––––––––––––––

రైతులను పట్టించుకోవడం లేదు:  మహమ్మద్, కోడుమూరు

రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడు లేడు. గత సంవత్సరంలో ఉల్లి పంట పండించాను. కర్నూలుకు ఉల్లి తీసుకెళ్తే మద్దతు ధర ఇస్తామన్నారు. ఉల్లి రైతులకు నష్టపరిహారం చెల్లించడం లేదు. రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. మద్దతు ధరలు లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి నాయకుడు రైతుల వెంటా ఉంటానని వస్తున్నారే తప్ప ఎవరూ రైతులను మేలు చేయడం లేదు. ఆరోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి తప్ప మరేవరు రైతులను తోడుగా నిలబడటం లేదు.  ఎంతో మందికి మా సమస్యలు చెప్పుకున్నాం. ఎవరు తీర్చడం లేదు. వైయస్‌ జగన్‌ స్పందిస్తూ చంద్రబాబుకు ఘాట్‌గా లేఖ రాస్తామని, పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని చెప్పారు.

––––––––––––––––

వడ్డీకే సరిపోవడం లేదు: మల్లన్న, సీ, బెళగల్‌

నాకు రూ. 2 లక్షల పంట రుణాలు అయ్యాయి. చంద్రబాబు ఇస్తున్న రుణమాఫీ వడ్డీకే సరిపోవడం లేదు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఒకేసారి రుణాలు మాఫీ అయ్యాయి. మనం ఓటు వేసి జగనన్నను సీఎం చేసుకుందాం.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య