• YSRCP DMW, Vuyyuru Town

కోడెలను విమర్శించడం తప్పా..?


వైయ‌స్ఆర్ సిపి అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
  • క‌బ్జాల‌పై వ్య‌తిరేకంగా పోరాడుతుంటే త‌న‌పై క‌క్ష‌సాధింపులు

  • స‌భాప‌తిని, స‌భ‌ను అగౌర‌వ‌ప‌రిచే వ్యాఖ్య‌లు ఎప్పుడు చేయ‌లేదు

  • పోలీసు వ్య‌వ‌స్థ‌ను అడ్డుపెట్టుకొని మ‌మ్మ‌ల్ని అణ‌చివేయాల‌ని చూస్తున్నారు.

విజయవాడ: ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా పనిచేస్తున్న కోడెల శివప్రసాద్‌ తనకు రాజకీయ ప్రత్యర్థి అని రాజకీయంగా ప్రత్యర్థిని విమర్శించడం తప్పు ఎలా అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. శాసనసభ, సభాపతి, చట్టాలు, సాంప్రదాయాలు అన్నా తనకు అత్యంత గౌరవమని, చిన్న వయస్సులోనే సభకు వెళ్లే అవకాశాన్ని ప్రజలు కల్పించారని, ఐదు సంవత్సరాల పాటు ఉమ్మడి శాసనసభలో సభ్యుడిగా కొనసాగానని స్పష్టం చేశారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అంబటి ఘాటుగా సమాధానం ఇచ్చారు. కోడెల శివ‌ప్ర‌సాద్‌, ఆయ‌న కుమారుడు క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, వాటికి వ్య‌తిరేకంగా పోరాడుతుంటే త‌న‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అంబ‌టి రాంబాబు ఏమ‌న్నారంటే... 


– సభాపతిని, సభను అగౌరవ పరచాలని, కించపరిచే వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా ఎప్పుడు చేయలేదని, అలా చేసినట్లుగా సభ్యులు భావిస్తే క్షమించాల్సిందిగా కోరారు. 


– కోడెల శివప్రసాద్‌పై కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని, సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల, తాను ప్రత్యర్థులుగా పోటీ చేశామని, హోరాహోరీగా సాగిన పోటీలో కోడెల 924 ఓట్లతో గెలుపొందారని గుర్తు చేశారు. 


– ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోడెల శివప్రసాద్‌ తనను..పార్టీని, కార్యకర్తలను, అభిమానులను తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ క్యాడర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రౌడీ షీట్‌లు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


– పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకుని మమ్మల్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నిస్తుంటే రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన బాధ్యత అని అంబటి గుర్తు చేశారు. 


– సత్తెనపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నాయని అంబటి చెప్పారు. నాలుగులో ఒక మండలం, సత్తెనపల్లి మున్సిపాలిటీలో మాత్రమే మెజార్టీ వచ్చిందని, మిగిలిన మండలాల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయకేతనం సాధించిందన్నారు. 


– అత్యధికంగా ఎంపీటీసీలు గెలుచుకున్న మూడు మండలాల్లో కూడా కోడెల అన్యాయంగా మండలాధిపతులను చేజిక్కించుకున్నారని అంబటి మండిపడ్డారు.  


– ముప్పాల మండలంలో ఎంపీటీసీలను వెంటబెట్టుకొని ఎన్నికలకు వెళ్తుంటే తమపై కోడెల శివప్రసాద్‌ తనయుడు శివరామకృష్ణ పోలీస్‌ బలంతో వచ్చి దాడులకు దిగారని విరుచుకుపడ్డారు. దీన్ని క్రిమినల్‌ నేచర్‌ అనరా.. ఇలాంటి దౌర్జన్య ప్రవర్తనలు చేస్తున్న కోడెలను విమర్శించడం తప్పా..? ప్రజలే చెప్పాలన్నారు. 


– సత్తెనపల్లిలో క్యారమ్స్, షెటిల్, టెన్నీస్‌ ఆడుకునే క్లబ్‌ను పేకాట క్లబ్‌గా మారుస్తూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు ఆ స్థలాన్ని మింగేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఆ కబ్జాకు వ్యతిరేకంగా పోరాడుతుంటే తనపై కక్ష సాధించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 


– గతంలో గొడుగుల సుబ్బారావు అనే వ్యక్తి కోడెల శివప్రసాదరావుకు సన్నిహితుడుగా ఉండేవాడని, అతనికి 17 ఎకరాల స్థలం ఉంటే దాన్ని దౌర్జన్యం చేసి పోలీసులను ఉపయోగించి కోటిన్నర ఆస్తిని అర్థరాత్రి స్వాధీనం చేసుకున్న ఘనులు కోడెల అని అంబటి చెప్పారు. దిక్కులేక గొడుగుల సుబ్బారావు హైదరాబాద్‌కు పారిపోయాడన్నారు.  


– నడికుడి - కాళహస్తీ అని కొత్తగా రైల్వే మార్గం వేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్‌ కోడెలకు, ఆయన కుమారుడికి సుంకం చెల్లించకపోవడంతో వారి వర్క్‌షాపుపై పడి ఆస్తులను ధ్వంసం చేశారని గుర్తు చేశారు.  


– కోడెల శివప్రసాద్‌ ఒక టీవీ ఇంటర్వ్యూలో రూ.11.5 కోట్లు ఎన్నికలకు ఖర్చు చేశానని చెబితే అది తప్పుకాదా..? దీనిపై ఎన్నికల కమిషన్‌కు రిపోర్టు కూడా చేశామని అంబటి చెప్పారు. 


– కోడెలకు సత్తెనపల్లిలో సేఫ్‌ అనే మెడికల్‌ కంపెనీ ఉందని, దాంట్లో డ్రగ్స్‌ తయారు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ దుకాణాలు, ఆస్పత్రులు సేఫ్‌ మందులు ఖచ్చితంగా వాడాలని నిబంధన పెట్టారు. లేకపోతే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌తో బెదిరించే కార్యక్రమం చేపట్టార అంబటి పేర్కొన్నారు.  


– 2014 ఎన్నికల సమయంలో కోడెల సమర్పించిన అఫిడవిట్‌లో ఆయనపై 9 కేసులు ఉన్నాయి. వాటిలో 420 కేసు కూడా ఉందని ఆయనే ఒప్పుకున్నారని, 9 కేసులు ఉన్న వ్యక్తి క్రిమినల్‌ అవుతారా..? కాదా..? ప్రజలే చెప్పాలన్నారు.  


– 1999లో కోడెల శివప్రసాద్‌ ఇంట్లో బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగి పలువురు చనిపోయారని అంబటి గుర్తు చేశారు.  దానిపై గౌరవ కోర్టు సీబీఐ ఎంక్వైరీ వేసిందని, బాంబ్‌ కేసుపై కోడెలకు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని, దానికి ఆధారాలు కూడా ఇస్తానని చెప్పారు. కేసు రుజువైంది.. యాక్షన్‌ తీసుకోవడానికి పర్మిషన్‌ ఇవ్వండి అని సీబీఐ కేంద్రానికి లేఖ రాశారని. ఆ రోజున కేంద్రంలో ఉన్న పెద్దలను పట్టుకుని అనుమతి ఇవ్వకుండా కోడెల మ్యానేజ్‌ చేశారని చెప్పారు. 


– రాజకీయంగా ప్రత్యర్థిని విమర్శించడం తప్పెలా అవుతందని, తనను బదనాం చేయడానికి కోడెల కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అన్యాయంగా జైల్లో పెట్టినా జైలు గోడలు బద్ధలయ్యేలా కోడెల అన్యాయాలను వినిపిస్తానని చెప్పారు. 


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య