• YSRCP DMW, Vuyyuru Town

కొనుగోళ్లకు కోట్లల్లో.. జనాలు చీకట్లో


  • అభివృద్ధిని పక్కనపెట్టి బేరసారాలతో బిజీబిజీ

  • నీతి మంతుడిగా ప్రచారం.. అడ్డదారిలో ప్రయాణం

  • వీడియోలో అడ్డంగా దొరికిపోయిన గిడ్డి ఈశ్వరి 

చెప్పేది శ్రీరంగ నీతులు చెప్పేవి.. దూరేది అక్కడెక్కడో అనేది సామెత.. చంద్రబాబుకిది అతికినట్టు సరిపోతుందని చెప్పడానికి ఏ ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అవసరానికి తగ్గట్టు మాటలు మార్చేయడం.. తానో పుణ్యాత్ముడిగా మీడియాలో పెయిడ్‌ ప్రచారం చేయించుకోవడం బాబుకే అలవాటే. తనకు అన్యాయం జరిగితే ఇంతెత్తున అదిరిపడి ప్రపంచమంతా మునిగిపోయినట్టు గగ్గోలు పెట్టే చంద్రబాబు.. ఇంకెవరికైనా జరిగితే మాత్రం కనీసం నోరు కూడా మెదపరు. చివరాఖరికి ఓటేసి గెలిపించిన ప్రజలైనా.. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినా పార్టీ నాయకులైనా సరే.. అవసరం తీరాక బాబుకు ఇలాంటివన్నీ అప్రస్తుతం. మళ్లీ ఎన్నికలొస్తే తప్ప వారి ముఖం కూడా చూడరని బాబును చూస్తున్న ఏపీ ప్రజలందరికీ తెలుసు. 


మొన్నకమాట నేడొక పని..

తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ డబ్బులు పెట్టి సంతలో పశువులను కొన్నట్టు డబ్బులు పెట్టి కొంటున్నదని గగ్గోలు పెట్టాడు చంద్రబాబు. కేసీఆర్‌ రాజకీయ వ్యభిచారి అని ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని గ్రేటర్‌ ఎన్నికల్లో తండ్రీకొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు ఇంటింటికీ తిరిగి మరీ ప్రచారం చేశారు. ఇలాంటి పార్టీకి ఓటేసి గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని.. మనల్ని మనం ఉరి తీసుకున్నట్టేనని కన్నీరు పెట్టుకున్నాడు. కానీ ఇదంతా జరిగిన కొన్నాళ్లకే చంద్రబాబు నిజస్వరూపం చూపించాడు. టీఆర్‌ఎస్‌కు చెందిన నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిపోయాడు. పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సూట్‌కేసుల్లో కోట్లు ఇచ్చి పంపించి బేరం మాట్లాడాడు. ఫోన్‌లో మాట్లాడిన వాయిస్‌ నాది కాదని బుకాయిస్తూనే హైదరాబాద్‌ నుంచి అమరికాకు పారిపోయాడు. అప్పటిదాకా హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని శివాలెత్తిన చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి గప్‌చుప్‌మన్నాడు. 


కొనుగోళ్లకు కోట్లల్లో..

ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు 20 నుంచి 30 కోట్లు ఖర్చు చే స్తున్న చంద్రబాబు నియోజకవర్గాల అభివృద్ధిని మాత్రం సాంతం పక్కన పెట్టేశారు. కేవలం మీడియాన మేనేజ్‌ చేసుకుని పెయిడ్‌ వార్తలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రలోభాలతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అభివృద్ధి చూసి వస్తున్నారని బుకాయిస్తున్నారు. అయితే రెండు రోజుల కిందటే పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యవహారం సంచలనమే. డబ్బుల కోసమే పార్టీ మారుతున్నారని చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఆరోపణలకు ఇది వాస్తవ రూపం. పార్టీ కార్యకర్తలతో ఆమె చేసిన సంభాషణలే టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య