• YSRCP DMW, Vuyyuru Town

జ‌న‌నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం


- క‌ర్నూలు జిల్లాలో దిగ్విజ‌యంగా ప్రజాసంకల్పయాత్ర

- రాజ‌న్న బిడ్డ‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం

- వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు


క‌ర్నూలు:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 6వ తేదీన ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన జ‌న‌నేత పాద‌యాత్ర క‌ర్నూలు జిల్లాలో 14వ తేదీ ప్ర‌వేశించింది. మొద‌ట ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం, ఆ త‌రువాత బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర చేసిన రాజ‌న్న బిడ్డ నిన్న సాయంత్రం డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్టారు. జ‌న‌నేత ఏ గ్రామానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అచ్చం పెద్దాయ‌న‌లా ఉన్నార‌ని మురిసిపోతున్నారు. త‌మ  స‌మ‌స్య‌లు తీర్చేందుకు కాలిన‌డ‌క‌న వ‌చ్చాడ‌ని అక్కున చేర్చుకుంటున్నారు. దారి పొడువునా పూల‌బాట వేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు బాస‌ట‌గా నిలుస్తున్నారు. వ్య‌వ‌సాయ కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మ‌హిళ‌లు ఇలా, అన్ని సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌కు సంఘీభావం తెలుపుతున్నారు. అంతేకాదు చంద్ర‌బాబు పాల‌న‌లో తాము మోస‌పోయామ‌ని స‌మ‌స్య‌లు ఏక‌రువు పెడుతున్నారు.  గ్రామ గ్రామాన ప్ర‌జ‌లు ఎదురెళ్లి మ‌రి రాజ‌న్న బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నారు.   


టీడీపీ ఎమ్మెల్యే ఊర్లో ఘ‌న స్వాగ‌తం

బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనానర్దన్‌రెడ్డి స్వగ్రామమైన యనకండ్లలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఈ గ్రామంలో మహిళా సదస్సు జరగాల్సి ఉండగా ఎమ్మెల్యే సభకు అనుమతి రాకుం డా అడ్డుకున్నారు. అలాగే వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు ఎవరూ వెళ్లకుండా హుకుం జారీ చేశారు. అయితే సోమవారం బనగానపల్లె శివారు నుంచి పాదయాత్ర యనకండ్ల సమీపానికి చేరుకుంటుండగా గ్రామప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై వేచి ఉన్నా రు. గంటపాటు యనకండ్ల మీదుగా సాగిన పాదయాత్రలో మహిళ లు, వృ ద్ధులు, యువకులు, అభిమానులు రాజన్న బిడ్డ జగన్‌ను చూసేందు కు ఎగబడ్డారు. అడుగడుగునా మహిళలు జగన్‌కు నీరాజనం పలికారు. స్థానిక టీడీపీ నాయకులు వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్రకు ఎవరూ వెళ్లకుండా ఎన్ని ప్రయత్నా లు చేసినా మహిళలు హారతిపట్టి జననేతకు స్వాగతం పలకడం విశేషం. 

మ‌హిళా స‌ద‌స్సు స‌క్సెస్‌


బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలోని హుస్సెనాపురంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన మ‌హిళా స‌ద‌స్సు విజ‌య‌వంతం అయ్యింది. ఈ స‌ద‌స్సును అడ్డుకునేందుకు టీడీపీ నేత‌లు కుట్ర‌లు చేసినా మ‌హిళ‌లు లెక్క‌చేయ‌కుండా క‌థం తొక్కారు. ఎక్క‌డిక్క‌డ వాహ‌నాలను పోలీసులు అడ్డుకున్నా వెనుతిర‌గ‌కుండా జన‌నేత‌ను క‌లుసుకున్నారు. తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్ర‌తిప‌క్ష నేత‌కు చెప్పుకున్నారు. అన్నా మీరు అధికారంలోకి రావాల‌ని వేడుకున్నారు. 


అన్ని వ‌ర్గాల‌కు తోడుగా

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని వ‌ర్గాల‌కు తోడుగా నిలుస్తున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా విద్యార్థి జేఏసీ నేత‌లు, ఉద్యోగులు, రైతులు జ‌న‌నేత‌కు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోని గోర్ల‌గుట్ట గ్రామానికి చేరుకున్నారు. అక్క‌డ నాపరాయి పరిశ్రమలు ఎక్కువగా ఉండే గోర్లగుట్ట గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్తులు, క్వారీ కార్మికులు తమ సమస్యలను వైయ‌స్ జగన్‌ దృష్టికి తెచ్చారు. పింఛనురాలేదని కొందరు, ఇళ్లు మంజూ రు కాలేదని మరికొందరు జన నేత దృష్టికి తీసుకొచ్చారు. ఇల్లూరి కొత్త పేట గ్రామం వద్ద కుమ్మరి కులస్తులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. కుమ్మరి వాళ్లకు వైయ‌స్ఆర్ హయాంలో 2 ఎమ్మెల్సీలు, 1 ఎమ్మెల్యే సీటు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తమ వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం సరిగా లభించడం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా బడ్జెట్‌లో తమ వర్గానికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఇక కుండలు తయారు చేసేందుకు అవసరమైన సంప్రదాయ మట్టి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు.. వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు.  జ‌న‌నేత పాద‌యాత్ర‌కు క‌ర్నూలు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య