• YSRCP DMW, Vuyyuru Town

జగన్ రాకతో బీసీ యువతలో ఉత్సాహం


  • రెండు మూడు రోజుల్లో బీసీకమిటీ

  • పాదయాత్ర తర్వాత బీసీ డిక్లరేషన్

  • ప్రతి బీసీ సోదరుడి ముఖంలో నవ్వును చూడాలన్నదే ధ్యేయం - వై.యస్ జగన్

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని యువతరం ఎందుకు అంతలా ఇష్టపడుతుందో, జగన్ బాటను జగనిజం అంటూ ఎందుకు పిలుచుకుంటుందో ఏడో రోజు పాదయాత్రలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళలనం చూస్తే అర్థం అవుతుంది. యువకులకు జగన్ మోహన్ రెడ్డి ఒక హీరో. రోల్ మోడల్. అతని గట్స్, అతని నిజాయితీ, అతని ధైర్యం వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి. వారిలో ఉత్తేజాన్ని నింపుతాయి. తమ  కోసం ఓ నాయకుడున్నాడని నమ్మకాన్ని కలిగిస్తాయి. తమ లాగే ఆలోచించే ఓ యువరక్తం తోడుగా ఉందనే ధీమానిస్తాయి. వైయస్ జగన్ ఈ పేరే ఒక ప్రకంపన. ప్రతి హృదయాన్నీ తాకే ఆత్మీయ స్పర్శ. తెలుగు వాడి పౌరుషాన్ని తట్టి లేపే గంభీర నినాదం.


కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తే బిసి సంక్షేమమా…

ప్రతి బిసి సోదరుడి ముఖంలో నవ్వు చూడటమే తన ధ్యేయం అని ప్రకటించారు వైయస్ఆర్ సిపి అధినేత జగన్. చంద్రబాబు పేరుకే బిసిల మీద ప్రేమ కురిపిస్తున్నాడన్నారు. కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తే బిసిల సంక్షేమం జరిగిపోతుందా అని ప్రశ్నించారు. మీ అభివృద్ధి కోసం మీరే నాకు సలహాలివ్వండి అని బిసి యువతను సభాముఖంగా అడిగారు వైయస్ జగన్.


ఒక బిసి యువకుడు మాట్లాడుతూ

‘రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజ్ రియంబర్స్ మెంట్ ద్వారా తాను ఎమ్.బి.ఎ తన సోదరి డిగ్రీ చదువుకున్నామని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తనలా ఎమ్.బి.ఎ చేయాలనుకునే ఎంతో మంది బిసిలు చదువుకు దూరం అయిపోయారని వాపోయాడు. జగన్ నాయకత్వం పై నమ్మక ముందని, ఆయన ప్రభుత్వం తెచ్చుకుంటామని, బిసిల సంక్షేమం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే సాధ్యం అని అన్నాడు.


తెలంగాణ తరహాలో

ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణా తరహాలో గొర్రెల యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బావుంటుందని ప్రతిపక్ష నేతకు కొందరు కానగూడురు వాసులు సూచన చేసారు. అలాగే సొంత ఆటో ఉన్న వారికి బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయించాలని మరి కొందరు కోరారు. వైయస్సార్ ఉన్నప్పుడు గొర్రెలు చనిపోతే వాటి కూపన్ల ఆధారంగా ఇన్సూరెన్స్ వచ్చేదని ఇప్పుడలా లేదని, చంద్రబాబు రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, బిసిలకు ఒక్కరేమిటి అన్ని సామాజికవర్గాలకు ద్రోహం చేసారని విమర్శించారు విపక్ష నేత. తప్పుడు హామీలతో పుస్తకాల కట్టలాంటి మేనిఫెస్టో తయారు చేసి ఒక్కటంటే ఒక్క హామీనీ నెరవేర్చలేదని చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.


బిసి డిక్లరేషన్

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బిసిల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో బిసి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి నియోజకవర్గంలో తిరిగి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని నివేదిక ఇస్తుందని చెప్పారు. పాదయాత్ర పూర్తి అయ్యాక ఆ నివేదిక ఆధారంగా బిసి గర్జన సభ పెట్టి అక్కడే బిసి డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. ఈ పాదయాత్ర దోవపొడవునా కూడా మీ సూచనలు నాకు అందజేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసారు వైయస్ జగన్. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు ప్రతిపక్ష నేత. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ఫీజ్ రియంబర్స్ మెంట్ పెట్టారన్నారు. ఫీజు ఎంతైనా సరే ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి పెద్ద చదువులు నేను చదివిస్తాను, పిల్లలకు భోజన, వసతి సదుపాయాల కోసం 20 వేలు అదనంగా అందజేస్తామని చెప్పారు. ఇద్దరేసి పిల్లల్ని బడికి పంపే అక్కాచెల్లెళ్లకు అమ్మ ఒడి పథకం ద్వారా 15000 అందజేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 45 ఏళ్లకే ఫించను ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు వైయస్ జగన్ . 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య