• YSRCP DMW, Vuyyuru Town

హోరెత్తుతున్న ప్రజా సమస్యలు


పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలకు విశేష స్పందన
  • పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలకు విశేష స్పందన

  • టీడీపీ పై నిప్పులు చెరుగుతున్న ప్రజలు

  • ఇంకో సంవత్సరంలో ప్రజల ప్రభుత్వం వస్తుందని భరోసా

  • వైయస్‌ జగన్‌ ఆలోచన ఆచరణలో పెడుతున్న నేతలు

  • ప్రజల దగ్గర నుంచే మేనిఫెస్టో రూపకల్పన

ఆంధ్రప్రదేశ్‌: ప్రజలకు చేరువై, వారి సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ, పల్లెనిద్ర అనే బృహత్తర కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది . రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో  ఫిబ్రవరి నెలాఖరువరకు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయం మేరకు ప్రతి చోటా కార్యక్రమాల సందడి కనిపిస్తోంది. నియోజకవర్గంలోని అన్ని  గ్రామాల్లో చేపట్టే ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలుత పార్టీ జెండా ఆవిష్కరణలు, వైయస్ విగ్రహం వద్ద నివాళులతో ప్రారంభించి రచ్చబండ సమావేశంలో స్థానిక సమస్యలపై చర్చిస్తారు. ఇదే సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరిస్తూ , హోదా కావాలంటూ వారి వద్ద నుంచి సంతకాలను సేకరిస్తారు. ఆయా గ్రామంలోని వివిధ వర్గాలతో సమావేశమై రాత్రికి అక్కడే పల్లెనిద్ర చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపిలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ప్రజల్లో మమేకం అవుతున్నారు.

ప్రభుత్వం ప్రజాధనాన్ని అడ్డగొలుగా దోచుకుంటూ ప్రజాభివృద్ధిని గాలికొదిలేస్తే..  ప్రజల తరుపున పోరాడేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చింది ప్రతిపక్షం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.


ప్రభుత్వ పనితీరుపై ఫిర్యాదుల వెల్లువ

రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదు. పెన్షన్‌ రావడం లేదు. అకారణంగా పెన్షన్‌ తొలగించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవని ఇలా ప్రతి ఒక్కరు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటన్నింటినీ నోట్‌ చేసుకుంటూ, ఎవరూ అధైర్య పడొద్దు.. మరో సంవత్సరంలో ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తుందని వైయస్‌ఆర్‌ నాయకులు భరోసా ఇస్తున్నారు. అదే విధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు.  


నంద్యాల వంటి ప్రాంతాల్లోని కొన్ని గ్రాామాల్లో పల్లెనిద్రకు అనుమతి లేదంటూ  పోలీసులు ఆంక్షలతో బ్రేక్ లు వేయాలని చూస్తున్నా కార్యక్రమం విజయవంతమవుతూ రోజు రోజుకు విస్తృతమవుతోంది.

ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు దిద్దిన మ్యానిఫెస్టో రూపొందించాలన్న పార్టీ అధ్యక్షులు వైయస్  జగన్‌ ఆలోచనను నేతలంతా ఆచరణలో పెట్టారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రజలనంత ఒక్కచోటకు చేర్చి వారి సమస్యను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం వారితో పాటు రాత్రి భోజనం చేసి అదే గ్రామంలో పల్లెనిద్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయా ప్రాంత ప్రజలకు తామున్నామంటూ భరోసా ఇస్తున్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయని,  జననేత  సిఎం అయితేనే టిడిపి ఆరాచకాలకు అడ్డుకట్ట పడుతుందనే విశ్వాసాన్ని ప్రజలో పాదుగొల్పుతున్నారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య