• YSRCP DMW, Vuyyuru Town

గ్రాఫిక్స్ లో నీళ్లు పారిస్తారా బాబూ..?


  • కమీషన్ల కోసమే బాబు పోలవరాన్ని తీసుకొచ్చారు

  • పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

  • రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కాగ్, కేంద్రం ఆగ్రహం

  • పోలవరం ముసుగులో అంతా దోపిడీ చేశాక ట్రాన్స్ ట్రాయ్ రద్దంటున్నారు

  • జీవనాడి లాంటి పోలవరాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు

  • పోలవరంలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి

  • వైయస్సార్సీపీ తూ.గో. జిల్లా అధ్యక్షుడు కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లాః పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరాన్ని తెచ్చుకున్నారని వైయస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తూ, పునాదిరాళ్లు వేస్తూ, పూలు చల్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు తప్ప నిజాయితీగా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనబడడం లేదన్నారు. ఇప్పటికే పోలవరం నిర్మాణంపై కేంద్రం కూడ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.  జగ్గంపేటలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు.  రాష్ట్ర విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా చేయాలని చెప్పి విభజన చట్టంలో దీన్ని మనం ఓ అంశంగా చేర్పించుకున్నామన్నారు. కానీ,  దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టులు, కమీషన్ ల కోసం పోలవరాన్ని వాడుకుంటున్నారన్నారు. పోలవరం  జాతీయ ప్రాజెక్ట్ గా ఉంటే పునరావాసం సమస్యల దగ్గర్నుంచి నిర్మాణం వరకు పద్ధతి ప్రకారం సాగి ఉండేదన్నారు. పోలవరంలో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. 

పోలవరం అంతర్భాగంలో భాగంగా పట్టిసీమ, పురుషోత్తం పట్నం కడతామంటూ వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు తప్పితే.... అవే డబ్బులు పోలవరంపై పెడితే నిర్మాణం పూర్తవుతుందన్న ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. పోలవరం కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ రాయ్ ను రద్దు చేసి మరో సంస్థకు దీన్ని అప్పగిస్తారని వింటున్నామన్నారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్  సంస్థను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఇన్నాళ్లు తమకు కావాల్సిన వాళ్లకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని, దాని ముసుగులో కార్యక్రమాలన్ని చేసేసి ఇవాళ ఆ సంస్థను రద్దు చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అంటే,  చేసిన తప్పులు ఇక్కడితో పోతాయనే ప్రభుత్వం ఆ సంస్థను రద్దు చేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. వచ్చే కొత్త ప్రభుత్వం పోలవరానికి సంబంధించి విచారణ చేసి వీళ్లను బాధ్యులను చేస్తారన్న భయంతోనే ట్రాన్స్ ట్రాయ్ పై చర్యలు తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారన్నారు. 

కేంద్రం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ వరకు అందరూ పోలవరం నిర్మాణంలో జరుగుతున్న అవతవకలను అరికట్టాలని... కాగ్, సీబీఐలతో ఎంక్వైరీ జరిపించాలని ఫిర్యాదు చేసిన విషయాన్ని కన్నబాబు గుర్తు చేశారు. యుటిలైజేషన్ సర్టిపికెట్ కూడ కేంద్రానికి సమర్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం పనిచేయడం సిగ్గుచేటన్నారు. పోలవరం నిర్మాణంలో ఏ తప్పు జరగలేదనుకుంటే ప్రభుత్వం వెంటనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలన్నారు. రూ. 16వేల కోట్లున్న పోలవరం అంచనా వ్యయాన్ని చంద్రబాబు రూ. 45వేల కోట్లకు తీసుకొచ్చాడని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్అండ్ఆర్, పునరావాసం ఎక్కడ అమలు చేయడం లేదని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులు పునరావాసం లేక అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎక్కడి పనులు అక్కడే ఉంటే,  2018 మార్చికి పోలవరం ఎలా పూర్తవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రాఫిక్స్ లో రాజధాని కట్టామని చెప్పినట్టు గ్రాఫిక్స్ లో నీళ్లు పారించి రిబ్బన్ కట్ చేస్తారా బాబూ..?  జీవనాడి లాంటి పోలవరాన్ని ఇంత దారుణంగా నిర్లక్ష్యం చేయడం మంచిది పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

250 టన్నులతో ఏర్పాటు చేయాల్సిన గేటు డిజైన్ ను 200 టన్నులకు మార్చేశారని కన్నబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గా ఉన్న పోలవరాన్ని ఎలాంటి డిజైన్ సరికాకుండానే ఆగేటు నిర్మాణం  ప్రారంభించారంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. కమీషన్లపై ఉన్న శ్రద్ధని ప్రాజెక్ట్ పై చూపిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి హితవు పలికారు. కనీసం ఇప్పటివరకు ప్రాజెక్ట్ మానిటరింగ్ కు ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ కూడ ఏర్పాటు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రతి సోమవారం పోలవరం అని ప్రకచించిన బాబు ఎందుకిలా చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. కాగ్ ఇప్పటికే పోలవరంలో జరుగుతున్నతప్పులను ఎత్తి చూపిందని గుర్తు చేశారు.  2018కి పోలవరం పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తమపట్నం అవసరం లేదని ఓ పక్క చెబుతూనే... మరోపక్క, ప్రభుత్వం పురుషోత్తంపట్నం ప్రాజెక్ట్ కట్టడమేంటని కన్నబాబు నిలదీశారు. అదైనా 2018కి పూర్తవుతుందని గుండెలమీద చేయి వేసుకొని చెప్పగలరా..? స్పిల్ వే పనుల్లో ప్రగతి లేదు. కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టలేదు. కాపర్ డ్యాం ఎందుకు చేపట్టలేదని కేంద్రం నుంచి  వచ్చిన కమిటీ కూడ ప్రభుత్వాన్ని కడిగివేసిందన్నారు. వచ్చిన నిధులను ఖర్చు చేసినట్టు చూపిస్తూ...దొడ్డిదారిన నిధులు లాగేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదని కన్నాబాబు ఫైర్ అయ్యారు. 


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య