• YSRCP DMW, Vuyyuru Town

బీసీలను చట్టసభల్లో కూర్చోబెడుతా


  • బీసీ సంఘాలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి

  • వాల్మీకులకు ఎంపీ టికెట్టు

  • రాజకీయ ప్రాధాన్యత లేని కులాలను చట్టసభల్లోకి తీసుకెళ్తాం

  • 45 ఏళ్లకే పింఛన్లు

అనంతపురం: బీసీ కులాల్లో అట్టగుడు స్థాయిలో ఉండి రాజకీయ ప్రాధాన్యత లేని వారికి చట్టసభల్లోకి తీసుకెళ్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హమీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో బీసీలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకొని, అండగా ఉంటానని జననేత హామీ ఇచ్చారు. వాల్మీకులకు ఎంపీ టికెట్టు, నాయీబ్రహ్మణులు, వడ్డెరలు, లింగాయత్‌లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని మాట ఇచ్చారు. బీసీ కులాలతో వైయస్‌ జగన్‌ నిర్వహించిన ముఖాముఖి ఇలా.. 


బీసీలకు ఎంపీ టికెట్టు కేటాయించాలి:   గోవర్ధన్,   బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి

ఎన్నో సంవత్సరాలుగా వైయస్‌ఆర్‌సీపీ బీసీల పట్ల మంచి దృక్ఫథంతో ఉన్నా కూడా మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాలేకపోయం. అది మా దురదుష్టం. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు బీసీలకు వంద టికెట్లు ఇస్తామని, వృత్తి కులాలకు ఫెడరేషన్లు ఇస్తామని వంటి 110 హామీలు ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మా జిల్లాలో ఎన్నో బీసీ సమస్యలు ఉన్నాయి. సుమారు 50 శాతం మంది బీసీలు ఉన్నారు. ఏ పార్టీ కూడా బీసీలకు మేలు చేయలేదు. ఓట్లు మాత్రమే దండుకుంటున్నారు.  బీసీ ఫెడరేషన్లకు రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక బీసీలకు ఇచ్చిన హామీలన్ని కూడా నెరవేరుస్తారని బీసీలు నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో బీసీలు వైయస్‌ఆర్‌సీపీకి అండదండలు అందజేస్తామని చెబుతున్నాం. మా జిల్లాలో బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కోరుతున్నాను.

వైయస్‌ జగన్‌: గోవర్ధన్‌ చెప్పినదాంట్లో వాస్తవం ఉంది. నిరుడు ఎన్నికల్లో ఇదే జిల్లాలో రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్లు ఉంటే వాటిలో బీసీలకు ఇవ్వలేకపోయాం. ఈ సారి ఒక్కటైనా బీసీలకు కేటాయిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక్కడే కాదు కర్నూలులో కూడా ఒక పార్లమెంట్‌ స్థానం బీసీలకు కేటాయిస్తాం. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా మనం గెలిచే స్థానాలను బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

–––––––––––––––––––––––––––

రమణ,  గొర్రెల‌  కాపరి.

మా నాన్న, నేను గొర్రెలు కాస్తున్నాం. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గొర్రెల‌ చనిపోతే పరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి పథకం లేదు. 

వైయస్‌ జగన్‌: ఒక్కసారి నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. ఎక్కడికి వెళ్లినా గొ్రరెలకు ట్యాగ్‌ఉండేది. చనిపోయిన ప్రతి గొ్రరెకు రూ.8 వేలు ఇచ్చే  వారు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి. గొ్రరెలు చనిపోతే ఎవరైనా పట్టించుకునే వారు ఉన్నారా? అందరికి మాట చెబుతునాను..గొ్రరెలను పట్టించుకోవడమే కాదు..మనం అధికారంలోకి వచ్చిన వెంటే 102 పథకాన్ని అమలు చేస్తాం. ఈ నెంబర్‌కు ఫోన్‌ కొడితే వైద్యం అందిస్తారు. మళ్లీ గొ్రరెల చెవులకు ట్యాగ్‌ ఏర్పాటు చేస్తాం. ఇన్సూరెన్స్‌ కూడా ఇస్తాం.

–––––––––––––––––––

మేకల వెంకటేష్‌ గౌడు

గీత కార్మిక ఫెడరేషన్‌లో అరకొరగా బడ్జెట్‌ కేటాయించి బీసీలకు మోసం చేసింది. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని నమ్ముతున్నాం. మీరు సీఎం అయ్యాక రూ.1000 కోట్లతో ఈడిగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. గీతా కార్మికులకు యాభై సంవత్సరాలు దాటిన వారికి పింఛన్‌ ఇవ్వాలని, భూమి కేటాయించాలని కోరుతున్నాం. ఈడిగలందర్నికి కూడా మహానేత ఏదో ఒక సంక్షేమ పథకంతో మేలు చేశారు.

వైయస్‌ జగన్‌: ఈడిగలకు న్యాయం చేస్తాం.

–––––––––––––––––––––––––

సిద్ధప్ప, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌

బీసీలకు వైయస్‌ జగన్‌ అండగా ఉంటారు. మనమందరం కూడా ఐక్యంగా ఉంటూ వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకొద్దాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నాను. గతంలో కాల్వ శ్రీనివాసులుకు ఒక అర్జీ ఇచ్చిన తరువాత పట్టించుకోవడం మానేశారు. మంత్రి పదవిని పల్లె రఘునాథరెడ్డి నుంచి కాల్వకు ఇచ్చారు. వాల్మీకులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి కాల్వ శ్రీనివాసులుకు మంత్రి పదవి ఇస్తున్నానని చెప్పారు. ఒక కుటుంబానికి మంత్రి పదవి ఇస్తే అందరం బాగుపడుతామా అని ప్రశ్నించారు. వాల్మీకుల పట్ల టీడీపీ మోసం చేస్తుంది, వారిని నమ్మే పరిస్థితి లేదు. వాల్మీకులు మిమ్మల్నే నమ్ముకున్నాం. న్యాయం చేయండి.

వైయస్‌ జగన్‌: పూర్వం మద్రాస్‌లో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రంగా మార్చాలని ఒత్తిడి చేయడంతో భాగాలుగా విడగొట్టి ఏపీని ఒక్కటి చేశారు. బళ్లారి నుంచి కొన్ని జిల్లాలు ఇటువైపు వచ్చాయి. ఇంతకు ముందు ఏపీ మద్రాస్‌ ప్రెసిడెంట్‌లో ఉన్నపుడు బోయలు, వాల్మీకులు ఎస్టీలుగా ఉండేవారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత బోయలకు నష్టం జరిగింది. పక్కను ఉన్న బళ్లారి జిల్లాలో బోయలు ఎస్టీలుగా ఉన్నారు. ఇక్కడేమో బీసీలుగా ఉండటం ధర్మమేనా? అప్పుడు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రతి బోయ సోదరుడికి నేను తోడుగా ఉంటాను. బోయలను ఎస్టీలుగా చేర్చుతామని చెప్పడం వారిని మోసం చేయడమే. ఓట్ల కోసం చేసేస్తామని చెబితే దయచేసి ఆ నాయకుడిని నమ్మొద్దు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. కేంద్రంపై ఒత్తిడి చేసి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఒత్తిడి చేసేందుకు చిత్తశుద్ధితో పోరాటం చేస్తాం. తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక వాల్మీకి ఎంపీ టికెట్టు ఇస్తామని మాట ఇస్తున్నాను. ఆలు లేదు, చూలు లేదు. బోయలను ఎస్టీలుగా చేశామని చంద్రబాబు చెబుతున్నారు. చాలా తెగలు ఉన్నాయి. వాళ్లలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరుగలేదు. చంద్రబాబు చేయకుండానే చేసినట్లు యాక్టింగ్‌ చేస్తూ కులాల మధ్య రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మానవత్వంతో ఆలోచించాలని సూచించారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని, వైయస్‌ఆర్‌సీపీ తోడుగా ఉంటుందని ఖచ్చితంగా చెబుతున్నాను.

–––––––––––––––––––––––

నాయిబ్రాహ్మణులకు న్యాయం చేయాలి

మల్లికార్జున, నాయిబ్రహ్మణ సంఘం

నాయిబ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నాను. నాయిబ్రహ్మణులు వైయస్‌ఆర్‌సీపీకి అండగా ఉంటామని చెబుతున్నాం. నాయీబ్రహ్మణులకు పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఎస్సీ జాబితాలో మా కులాన్ని చేర్చాలని కోరారు.

వైయస్‌ జగన్‌:  బీసీ కులాల్లో అట్టగుడు స్థాయిలో ఉండి రాజకీయ ప్రాధాన్యత లేని వారికి చట్టసభల్లోకి తీసుకెళ్తానని హమీ ఇస్తున్నాను. ఇటువంటి కులాలు చట్టసభల్లో ఉంటేనే ఆ కులాల తరుఫున వారు మాట్లాడుతారు. 

––––––––––––––––––

వడ్డె గోపాలకృష్ణ

వడ్డెర్లు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. అనంతపురంలో 4 లక్షల మంది ఉన్నారు. మాకు ఎవరూ కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు. మహానేత హయాంలో 4 మున్సిపల్‌ చైర్మన్‌ పదువులు ఇచ్చారు. వడ్డెర కార్పోరేషన్‌ కూడా ఏర్పాటు చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వైయస్‌ జగన్‌ కూడా గుంటూరులో జెడ్పీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. చంద్రబాబు వడ్డెర్లకు సుత్తేలు, గడార్లు తప్ప ఇచ్చింది శూన్యం, ఈ జిల్లాలోని కదిరి, పుట్టపర్తిలో వడ్డెర్లు అధికంగా ఉన్నారని, ఈ నియోజకవర్గాల్లో వడ్డెర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాను.

వైయస్‌ జగన్‌: కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఇస్తాం. ఎక్కడ గెలువగలిగే అవకాశం ఉంటే అక్కడ కేటాయిస్తాం.

––––––––––––––––

 బచ్చలన్న

నవరత్నాలు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి.

––––––––––––––––

ధనుంజయ, 

మమ్మల్ని వైయస్‌ రాజశేఖరరెడ్డి బీసీ సంఘంలో చేర్చారు. కానీ బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. 

వైయస్‌ జగన్‌: నాన్నగారు చనిపోయిన తరువాత చంద్రబాబు అందరికి అన్యాయం చేస్తున్నారు.

––––––––––––––––

కాపు రామచంద్రారెడ్డి

 వీరశైవ లింగాయతీయులను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతున్నాను. పాల కేంద్రాలను చంద్రబాబు నాశనం చేసి ప్రభుత్వ డైరీలను నిర్వీర్యం చేశారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక పాలు అమ్ముకునే ప్రతిరైతుకు సాయం చేయాలని కోరుతున్నాను.

వైయస్‌ జగన్‌: కర్ణటక రాష్ట్రంలో పాడి రైతులకు మేలు చేస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు తన సొంత డైయిరీ ఏర్పాటు చేసుకున్నారు. తన డెయిరీకి మేలు చేకూర్చుకునేందుకు ప్రభుత్వ డెయిరీలను మూత వేయిస్తున్నారు. హెరిటేజ్‌ మాత్రం విఫరీతంగా లాభాల్లో పయనిస్తుంది. కర్ణాటక రాష్ట్రం కంటే ఎక్కువ మేలు చేసే విధంగా పాడీ రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను.  రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేసిన బీసీ కమిటీలు రాష్ట్రమంతా పర్యటిస్తారు. ప్రతి జిల్లాలో బీసీ సదస్సులు ఏర్పాటు చేస్తాం. పాదయాత్ర అనంతరం బీసీ గర్జన సభ ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తామని వైయస్‌ జగన్‌  హమీ ఇచ్చారు.


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య