• YSRCP DMW, Vuyyuru Town

అన్నొస్తున్నాడని….


  • జన నేతను చూసేందుకు ప్రజల ఉత్సాహం

  • పెద్ద మనసుతో దీవిస్తున్న అవ్వ, తాతలు

  • బిడ్డలను బడికి పంపండి-మంచి చదువులు నేను చదివిస్తానని భరోసా ఇచ్చిన ప్రతిపక్ష నేత

  • చదువుతోనే పేదరికం దూరం అవుతుందని చెప్పిన జగన్

సౌదరదిన్నె నుంచి మొదలై సాయంత్రం బనగానపల్లె చేరే వరకూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 15కిలో మీటర్లకు పైగా సాగింది. అంతటి పాదయాత్ర చేయాలంటే ఎంత ఓపిక కావాలి. ఆకాలికి ఎంతసత్తువ ఉండాలి. ఆనడకకు ఎంతబలం కావాలి…? ఆ యువనేతకుఆశక్తిఎక్కడినుంచివచ్చింది…? ఇంకెక్కడి నుంచి ఆప్రజాసమూహంనించే వచ్చింది.

ప్రతి అడుగూ ఆర్తితో ఎదురయ్యే హృదయాన్నితడమటానికైనప్పుడు ఆనడకకి అలుపెందుకొస్తుంది….? తమ ప్రియతమ నేత వైయస్ రాజశేఖరరెడ్డి బిడ్డను కళ్లారా చూడాలని వేలాదిగా ప్రజలు ప్రజాసంకల్ప యాత్రకు ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. ఒక్కసారైనా జగనన్నతోమాట్లాడాలని ఉవ్విళ్లూరుతున్నారు. కనీసం దూరం నుంచైనా చూడాలని ఆతృతపడుతున్నారు.

ప్రతిపక్షనేత పాదయాత్ర గతవారం రోజులుగా కర్నూలు జిల్లాలోసాగుతోంది. ఆంధ్ర రాష్ట్రానికి తొలిరాజధాని నగరం కర్నూలు. ప్రస్తుతం కష్టాల్లో కూరుకుపోయిందీ దత్తమండలం. పౌరుషాలగడ్డలో నేడు కరువు తాండవిస్తోంది. యువనేత అడుగులు కర్నూలు హృదయంలోఉన్నాయి. కర్నూలు జిల్లాకు ఆత్మలాంటి బనగానపల్లెలో సోమవారం ప్రజాసంకల్పయాత్రసాగుతోంది.  పల్లెపల్లెలోనూ కష్టాలే వినిపిస్తున్నాయి. శెనగపంటవేసి నష్టపోయిన రైతులు, ఉపాధి లేక అల్లాడుతున్న చేతివృత్తుల వారు, బ్యాంకు అధికారుల వేధింపులకు గురౌతున్నమహిళా సంఘాలు ఇలా అన్నివర్గాల వాళ్లూ జగనన్నకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఏముంది వారి దగ్గర ఆ రాజన్నబిడ్డకుఇవ్వడానికి గుప్పెడు మనసుతప్ప. అందుకే ఆ మనసు నిండుగా ఆశీర్వదిస్తున్నారు. చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. వారి ఆశలనే హారతులుగా చేసి యువనేత కళ్లకు అద్దుతున్నారు. వారి నమ్మకాలే పూలుగా చేసి ఆ నాయకుడు నడిచొచ్చే బాటంతా పరుస్తున్నారు. రాజన్న రాజ్యం తెచ్చేది జగనన్నే అని విశ్వాసంతో ఆయన వెన్నంటి నడుస్తున్నారు.

ఆ సమయంలోనే ఓఆడ బిడ్డ చేతిలో చిన్నారితో ఎదురైంది. వారిని ప్రేమగా పలకరించారు యువనేత. ఆ బిడ్డను పనులకు తీసుకువెళ్లద్దని, బడికి పంపిచమనీ ఆ తల్లిని కోరారు. మీ కోసం నవరత్నాలు ప్రకటించామని మీరు చేయాల్సిందల్లా బిడ్డలను బడికి పంపడమే అని చెప్పారు. ఉన్నత చదువులు చదవడం ద్వారానే పేదరికాన్ని దూరం చేసుకోగలమని వారికి వివరించారు. విద్యార్థులకు ఫీజు ఎంతయినా మన ప్రభుత్వమే ఇస్తుందని, ఇంకా వారి ఖర్చుల కోసం కూడా 20వేలు అందిస్తామని చెప్పారు ప్రతిపక్షనేత వైయస్ జగన్ . లక్షల్లో అవుతున్న చదువులకు చంద్రబాబు ముష్టిలా 30వేలు విదిలిస్తున్నాడని, పేదలకు ఉన్నత చదువులను దూరంచేస్తున్నాడని విమర్శించారు. ఇక అన్నదాతల సమస్యలను సావధానంగా విన్నయువనేత వారికి భరోసా కల్పించారు. మద్దతు ధరను నిర్ణయించే విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని మాటిచ్చారు. అడుగడుగునా ఆప్యాయంగా పలకరిస్తున్న ప్రజలకు మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య