• YSRCP DMW, Vuyyuru Town

అన్నీ ప్రభుత్వ హత్యలే


  • సర్కారు నిర్లక్ష్యమే దుర్ఘటనలకు కారణం

  • ఒక్క కేసులోనూ నిందితులకు శిక్ష పడింది లేదు

  • అన్ని ప్రమాదాల వెనుక అవినీతే మూలం

చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రం శ్మశానంగా మారుతోంది. ప్రభుత్వ అవినీతి కారణంగా డజన్ల కొద్దీ జనాలు మృత్యుకౌగిట్లోకి చేరిపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి సేద్యంలో నాగలి కత్తులు గుచ్చుకుని మాగాణి బురదలో కలిసిపోతున్నాయి. 


వరుసగా అవినీతి ప్రమాదాలు 

చంద్రబాబు ప్రభుత్వం అవినీతి కారణంగా వేల కోట్ల సంపదే కాదు.. అంతకన్నా విలువైన.. వెనక్కి తిరిగివ్వలేని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గ్రామస్థాయిలో ఉండే జన్మభూమి కమిటీల దగ్గర్నుంచి ఇసుక మాఫియా, గంధపు చెట్ల స్మగ్లింగ్, భూ మాఫియా.. రూపంలో సీఎం వరకు అవినీతి దాహానికి ఎంతోమంది బలైపోతున్నారు. డబ్బు సంపాదించడానికి మార్గం అవసరం లేదు. డబ్బు సంపాదనే ధ్యేయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతికి లైసెన్సు వచ్చినట్టయింది. పచ్చ చొక్కాలు వేసుకుంటే లైసెన్సు వచ్చేసినట్టు పచ్చగా ఉన్న రాష్ట్రం మీద పడి మిడతల్లా జనం రక్తాన్ని పీల్చేస్తున్నారు. 


డజన్ల కొద్దీ మరణాలు

ఏ ముహూర్తాన చంద్రబాబు అధికారం చేపట్టాడో కానీ.. ఒక్కో దుర్ఘటనలో డజన్ల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇవన్నీ ప్రకృతి విపత్తు వల్లనో.. ప్రమాద వశాత్తు జరిగినవైతే.. వారి ఖర్మ అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ ప్రభుత్వం అవినీతికి డోర్లు బార్లా తీయడం వలన.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగినవే. అందుకే ఇవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. 


పుష్కరాల్లో 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పబ్లిసిటీ పిచ్చితో షూటింగ్‌ చేస్తుండగా తొక్కిసలాట జరిగి పుణ్యం కోసం వచ్చినోళ్లు పుణ్యలోకాలకు చేరిపోయారు. దానిమీద విచారణ కమిటీ వేశారు. ఈ దుర్ఘటన జరిగి రెండేళ్లు దాటింది. ఏం తేల్చారో ఆ భగవంతుడికే తెలియాలి. 

గోదావరి పుష్కరాలకు వచ్చిన వారు అలా చనిపోతే.. తాజాగా అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా గోదావరి, కృష్ణా పవిత్ర సంగమంలో మరో 30 ప్రాణాలు కోల్పోయారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా.. లైఫ్‌ జాకెట్లు ఇవ్వకుండా ప్రయాణికులను బోట్లో పంపడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మీ దొడ్లో లైటేస్తే నాకు కనపడుతుందని చెప్పే చంద్రబాబు.. తన ఇంటివెనుక కృష్ణమ్మలో కలిసి అసువులు బాసిన ఆక్రందనలు బాబుకు వినపడకపోవడం శోఛనీయం. 


ఏర్పేడు ఘటనలో ఇసుక మాఫియా కారణంగా లారీ ఢీకొని దాదాపు 19 మంది తీవ్రంగా గాయపడి అమాయక కూలీలు మృత్యువాత పడ్డారు. ప్రమాదానికి కారణమైన టీడీపీ నాయకులను చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించినా.. వారంతా తర్వాత్తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఫొటోలు.. వార్తలు హల్‌ చల్‌ చేశాయి. ఇదీ... నిందితులకు చంద్రబాబు కొమ్ముకాసే విధానం. జేసీ బస్సు దుర్ఘటనలో 11 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆనాడు సీఎం చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ఇప్పుడా కేసు ఏమైందో ఆయనకే తెలియాలి. ఇవి మాత్రమే కాదు.. నెల్లూరులో బాణసంచా గోడౌన్‌లో పేలుడు జరిగింది. ఎంతోమంది అమాయక కూలీలు చనిపోయారు. ఇవన్నీ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనల్లో బాధితులకు న్యాయం జరగలేదు. నిందితులకు శిక్ష పడిందీ లేదు. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య