• YSRCP DMW, Vuyyuru Town

అన్నా..ఆదుకోండి


  • వైయ‌స్ జ‌గ‌న్‌కు అన్న‌దాత‌ల విన‌తి

  • రుణాలు అంద‌డం లేద‌ని మ‌హిళ‌ల ఆవేద‌న‌

  • కుల వృత్తులు నాశనమైపోతున్నాయి. 

  • అంద‌రికి భ‌రోసా క‌ల్పిస్తున్న జ‌న‌నేత‌ క‌ర్నూలు: ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అడుగ‌డుగునా స‌మ‌స్య‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. ఏ ఒక్క‌రిని ప‌ల‌క‌రించినా అన్నా..నీవే దిక్కు..అన్నా..ఆదుకోండి అంటూ మొర‌పెడుతున్నారు. మ‌హానేత పాల‌న‌లో మాకు పింఛ‌న్ వ‌చ్చేది కొంద‌రు, రాజ‌న్న రాజ్యంలో ధీమాగా బ‌తికామ‌ని రైతులు, ప్ర‌భుత్వ వేధింపులు తాళ‌లేక‌పోతున్నామ‌ని ఉద్యోగులు, ఫీజులు అంద‌డం లేద‌ని విద్యార్థులు, కుల వృత్తుల‌కు ఆద‌ర‌ణ క‌రువైంద‌ని ప‌లు సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు విన్న‌విస్తున్నారు. ఈ నెల 6న వైయ‌స్ఆర్ జిల్లాలో ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్వీజ‌యంగా కొన‌సాగుతోంది. జ‌ననేత కోసం ప్ర‌జ‌లు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. వేలాది మంది పాద‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. నిన్న కోడుమూడు నియోజ‌క‌వ‌ర్గంలోని నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ప‌లువురు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. అందులో కొంద‌రి స‌మ‌స్య‌లు ఇలా ఉన్నాయి..  


ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు

- ‘పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో  పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలు కావాల్సి వస్తోంది. ఆదాయం వస్తుందన్న ఆశతో అప్పులు తెచ్చి పంట సాగు చేస్తే లాభం అటుంచి నష్టాలొస్తున్నాయి. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఏ రైతూ అప్పులపాలు కాకుండా చూడాలి’ అని కోడుమూరు మండలం గోరంట్ల గ్రామ పత్తి రైతులు కృష్ణయ్య, మల్లన్న తదితరులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. వీరు తమ పొలంలో పండిన పత్తిని చూపిస్తూ గిట్టుబాటు ధర లేకుండా పంటను ఎలా అమ్ముకోవాలన్నా అంటూ ఆవేదన వెలిబుచ్చారు. తాను పది ఎకరాల్లో పంట సాగు చేస్తే పెట్టుబడి రూ.2,50,000 అయిందని, దిగుబడి తగ్గడం, రేటు లేకపోవడంతో పంటంతా అమ్ముకున్నా రూ.80,000 కూడా వచ్చే పరిస్థితి లేదని కృష్ణయ్య ఆవేదన చెందారు. రూ.2 లక్షలకు పైగా అప్పు చేశానని, అది ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని వాపోయారు. వైయ‌స్ జగన్‌ స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్యాయం జరగనివ్వబోమని, ఏ రైతూ అప్పు చేయాల్సిన పరిస్థితి రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. నాన్నగారి హయాంలో రైతులు ఎంత సంతోషంగా ఉండేవారో  మన ప్రభుత్వం వచ్చాక కూడా అంతే సంతోషంగా ఉంచుతానన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని రైతులను కోరారు. 


న‌మ్మి మోస‌పోయాం: డ‌్వాక్రా మ‌హిళ‌లు

అన్నా ..ఎన్నిక‌ల‌ప్పుడు చంద్ర‌బాబు మా రుణాలు మాఫీ చేస్తామంటే న‌మ్మి మోస‌పోయాం. ఒక్క రూపాయి కూడా మాఫీ కావ‌డం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డం లేదు. ఎలా బ‌త‌కాల‌న్నా ..అని వైయ‌స్ జ‌గ‌న్‌కు డ్వాక్రా మ‌హిళ‌లు మొర‌పెట్టుకున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృçష్ణగిరి మండలం ఎర్రగుడి, కోడుమూరు మండలం గోరంట్ల గ్రామాల్లో డ్వాక్రా మహిళలు ఆయనను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.  చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీ  నమ్మి మోసపోయామంటూ ఆవేదన చెందారు.ఇందుకు స్పందించిన జ‌న‌నేత డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నేరుగా  ఇస్తామని, దాంతో బంగారం కొనుక్కోవాలని సూచించారు. ఒక్క సంవత్సరం ఓపిక పడితే మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ బకాయిలు ఎంత ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతలుగా మీ చేతికే ఇస్తామని పునరుద్ఘాటించారు. దాంతో బంగారం కొనుక్కోవాలంటూ వారికి సూచించారు. అలాగే ప్రభుత్వం చెల్లించకుండా నిలిపేసిన పావలా వడ్డీ బకాయిల మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తామన్నారు. దీంతో మహిళా సంఘాలకు పావలా వడ్డీ వర్తిస్తుందన్నారు. 


♦ జీవో 85ని అమలు చేయాలి  

కమ్మరి, వడ్రంగి, స్వర్ణకళ, శిల్పకళ వంటి మా కుల వృత్తులు నాశనమైపోతున్నాయి. మా అభివృద్ధి కోసం గతంలో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన జీవో 85ను జగన్‌ అ«ధికారంలోకి వచ్చాక అమలు చేయాలని కోరుతున్నాం. – దేవపూజ ధనుంజయ ఆచారి, విశ్వబ్రాహ్మణుడు 


♦ రజకులకు సామాజిక చట్టం కావాలి  

దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రజకులపై సాంఘిక బహిష్కరణలు, దాడులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల తరహాలో రజకులకు ఒక సామాజిక చట్టాన్ని ఏర్పాటు చేయాలి.  

 – శేఖర్, ఏపీ రజక వృత్తికారుల సంఘం నేత

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య