• YSRCP DMW, Vuyyuru Town

అండగా ఉంటా..ఆశీర్వదించండి


  • చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు

  • ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు

  • బీసీల పై బాబు కపట ప్రేమ

  • చదువుల విప్లవం సృష్టిస్తాం

  • ఉన్నత చదువులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌

  • పొదుపు మహిళలరుణాలు నాలుగు విడతల్లో చెల్లిస్తాం

  • పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం

  • పింఛన్‌ రూ. 2 వేలకు పెంచుతాం

  • పులికనుమ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

కర్నూలు: చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకువచ్చేందుకు ఆరాటపడుతున్న తనను ఆశీర్వదించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 20వ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గోనెగండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాలుగేళ్ల పాలనను ఎండగట్టారు. తాను ప్రకటించిన నవరత్నాలు పథకాలను వివరిస్తూ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలను వివరించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..


చంద్రబాబు అనే వ్యక్తి నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం మనం చూశాం. నాలుగేళ్ల తరువాత ఇన్ని మోసాలు, ఇన్ని అబద్దాలు ఆడిన ప్రభుత్వం దేశంలో ఏది ఉండదన్న నిర్ధారణకు వచ్చాం.


– మనకు ఎలాంటి నాయకత్వం కావాలి. ఆలోచన చేయండి. మోసం చేసేవాడు మనకు నాయకుడిగా కావాలా? అబద్ధాలు చెప్పేవారు నాయకులు కావాలా?


– నాలుగేళ్ల క్రితం ఇదే పెద్ద మనిషి టీవీల్లో, గోడల మీదా, ఫ్లెక్సీల మీదా ఏం రాశారు. ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, ప్రతి పేద వాడికి ఇల్లు కట్టిస్తానని అన్నాడు. నాలుగేళ్ల తరువాత ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క ఇల్లైనా కట్టించాడా?.


– నాలుగేళ్ల క్రితం ఇదే చంద్రబాబు ఏమన్నారు. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయి. షాక్‌కొడుతున్నాయి. తాను సీఎం కాగానే బిల్లులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం కరెంటు బిల్లు రూ.50, 60, 70 మాత్రమే వచ్చేది. ఇవాళ చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లు రూ.500, 1000 చొప్పున వస్తుంది.


– నాలుగేళ్ల క్రితం రేషన్‌ షాపులో బియ్యం, కందిపప్పు, కిరోసిన్, పామాయిల్, చక్కెర, చింతపండు వంటి 9 రకాల నిత్యావసరాలు ఇచ్చేవారు. ఇవాళ బియ్యం తప్ప వేరేవి ఇవ్వడం లేదు. ఆ బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని కోత కోస్తున్నారు.


– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు అన్న మాటలు ఏంటీ? జాబు రావాలంటే బాబు రావాలని గొప్పలు చెప్పారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని రెండేళ్లు పెట్టి అన్నారు. ఈ 45 నెలల్లో ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు.


– ఎన్నికలకు ముందు చంద్రబాబు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం నాలుగేళ్ల తరువాత ఇంటికి వచ్చిందా? ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీకి కూడా సరిపోవడం లేదు.


– ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల తరువాత ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?


– ఇటువంటి చంద్రబాబును నాలుగేళ్లు చూశాం. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఆయనే అంటున్నారు. ఇటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావాలా? ఈయనకు మళ్లీ అవకాశం ఇచ్చామంటే ఈ సారి మన వద్దకు వచ్చి ఏమంటారో తెలుసా..ఇంటింటికి కేజీ బంగారం అంటారు. ఇంటింటికి మారుతి కారు ఇస్తానని అంటారు. 


– ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావాలి. రాజకీయ నాయకుడు పలానిది చేస్తానని మాట ఇచ్చి చేయకపోతే ఆ నాయకుడు ఇంటికి వెళ్లాలి. అప్పుడే విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది.


– చేనేత కార్మికుల గురించి ఆలోచిస్తే బాధనిపిస్తోంది. మొన్న ధర్మవరం వెళ్లాను. నేను వెళ్లేనాటికి 34 రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నారు. చాలా బాధనిపించింది. అంతమంది ఆడవాళ్లు నిరాహారదీక్షలు చేస్తున్నారు. కారణం ఏంటని అడిగితే..చేనేత కార్మికులకు సబ్సిడీ అందడం లేదట. చంద్రబాబు రెండేళ్ల క్రితం వెయ్యి రూపాయల సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారట. ఆ సబ్సిడీ గోవిందా.


– ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు రకరకాల ఫోటోలకు ఫోజులిస్తారు. చంద్రబాబు చేనేత రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ రుణాలు మాఫీ అయ్యాయా? ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు, షెడ్డు కట్టిస్తానని మాట ఇచ్చారు. అంతటితో ఆగిపోలేదు. ప్రతి చేనేత కార్మికుడికి లక్ష రుపాయల రుణం అన్నారు. చేనేత కార్మికుల నుంచి మొదలుపెట్టుకొని బీసీల వరకు కపట ప్రేమ చూపారు.


– బీసీల మీద ప్రేమ అంటే నాలుగు కత్తెర్లు ఇస్తే అది ప్రేమా? నిజమైన ప్రేమ చూపించారంటే అది ఒక్క దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతున్నాను. ఆ మహానేతే నాకు స్ఫూర్తి. ఆయన హయాంలో పేదవాడికి మేలు చేసే ఆలోచన చేశారు. ఆ పేద కుటుంబం పేదరికం నుంచి బయటకు వచ్చేందుకు గొప్ప పథకం ప్రవేశపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఉన్నత చదువులు చదివించి భరోసా కల్పించారు. ఇవాళ నాన్నగారు చనిపోయిన తరువాత పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ డాక్టర్లు, ఇంజీనీర్లు చదవే అవకాశం ఉందా?


–చంద్రబాబు పాలనలో రూ.35 వేలు ముష్టి వేసినట్లు ఫీజులు ఇస్తున్నారు. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు. ఆ డబ్బులు కట్టలేక చదువులు మాన్పివేయిస్తున్నారు. ఇవాళ వైయస్‌ రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని నవరత్నాలను ప్రకటించాం. 


– దేవుడి దయదలచి, మీ అందరు ఆశీర్వదిస్తే మనఅందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ అందరికి హామీ ఇస్తున్నాను. నాన్నగారు చేసిన దానికన్న ఒక మెట్టు ఎక్కువ చేస్తానని మాట ఇస్తున్నాను.


– మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంజనీరింగ్, డాక్టర్‌ చదువులు చదువుతున్న పిల్లలకే కాదు. చివరకు మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలను కూడా నేనే చదివిస్తాను. ప్రతి అక్క, చెల్లెమ్మకు చెబుతున్నాను. మీరు చేయాల్సిందల్లా చిన్న పిల్లలను బడులుకు పంపించాలి.  వారి చదువుల కోసం ప్రతి తల్లికి  ప్రతి ఏటా రూ.15000 ఇస్తామని మాట ఇస్తున్నాను.


– మన బతుకులు మారాలంటే ఆ చిన్న పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. అందుకోసమే నేను తోడుగా ఉంటాను. మీ పిల్లలను బడులకు పంపించండి వారిని ఇంజీనీర్లు, డాక్టర్లు నేను చదివిస్తాను. నాన్నగారి కంటే ఒక అడుగు ముందుకు వేసి హాస్టల్‌లో ఉండే పిల్లల కోసం ఆ ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ప్రతి ఏటా రూ.20 వేలు ఆ పిల్లలకు అందజేస్తాను. చదువుల విప్లవాన్ని సృష్టిస్తాను. 


– ప్రతి పేద వాడికి అండగా నిలిచేందుకు పింఛన్‌ రూ.2 వేలు చేస్తానని గర్వంగా చెబుతున్నాను. చంద్రబాబు వర్కుల గురించి చెబుతుంటారు. వారి వద్ద నుంచి లంచాలు తీసుకుంటున్నారు. అన్నిపెరిగిపోయాయని ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు. అవ్వతాతలకు వయస్సు పెరిగిపోతోంది. బతకడానికి తిండితో పాటు మందులు కావాలి. ఆ అవ్వతాతలకు ఎంత ఇచ్చిన తక్కువే. పింఛన్‌ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తానని మీ అందరికి చెబుతున్నాను. దీని వల్ల చాలా మటుకు మేలు జరుగుతుంది.


– ఈ నవరత్నాలను చాలా కార్యక్రమాలు చెప్పుకుంటూ వస్తున్నాను. పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మలందరికి చెబుతున్నాను. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశారు. మీరుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఇవాళ బ్యాంకుల వద్ద నుంచి నోటీసులు వస్తున్నాయి. దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీ రుణాలన్ని కూడా నాలుగు విడతలుగా పూర్తిగా మీ చేతికే ఇస్తాను.


– నాన్నగారి హయాంలో బాగా ఇల్లులు కట్టారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ చెబుతున్నాను. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇల్లు లేని వారు చేతులు ఎత్తండి అంటే ఒక్క చేయ్యి కూడా ఎత్తకుండా చేస్తాను. మీ అందరికి ఇల్లు కట్టిస్తాను.


– నీళ్లు అందడం లేదు. గిట్టుబాటు ధర లేదు. కర్నాటక నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి నీళ్లు లేవు. పులికనుమ ప్రాజెక్టు మనకళ్ల ముందే కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు వైయస్‌ఆర్‌ హయాంలో పులికనుమ ప్రాజెక్టుకు రూ.260 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు. హంద్రీనీవా నుంచి గాజుల దిన్నేకు నీరు ఇస్తే ఈ ప్రాంతంలో నీటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా నీరు ఇస్తానని చెప్పిన మాట బూటకంగా మారింది. మీ అందరికి తోడుగా ఉంటానని చెబుతున్నాను.


– నవరత్నాలపై ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే దారిపొడువునా వెళ్తున్నాను. వచ్చి సూచనలు ఇవ్వండి. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకొచ్చేందుకు ఆరాటపడుతున్నాను. మీ ముద్దు బిడ్డకు తోడుగా నిలవాలని పేరు పేరున హృదయ పూర్వంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య