• YSRCP DMW, Vuyyuru Town

అధికారంలోకి రాగానే రాజోలి ప్రాజెక్టును చేపడతాం


  • వైయస్ హయాంలో నిధులు మంజూరైనా ఒక్క అడుగు ముందుకు పడని పనులు

  • ప్రజా సమస్యలపై మంత్రివర్గం సమావేశం కావడం లేదు

  • కెసి కెనాల్ పరిధిలో 4 ఏళ్లల్లో ఒక్కసారి కూడా రెండు  పంటలకు నీళ్లివ్వలేదు

  • 2019 ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి అమలు చేసి 2024 ఎన్నికలకు వెళతాం

  • ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి


ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి మార్గదర్శకంలో రూపొందే మానిఫెస్టోతో 2019 ఎన్నికలకు వెళ్లి, 2024 కల్లా అందులోని అంశాలను పూర్తి చేసి చూపెడతామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.పేదల భూములను ధనవంతులకు దోచిపెట్టేందుకు మాత్రమే  రాష్ట్ర మంత్రివర్గం  సమావేశమవుతోంది తప్పితే, ప్రజా సమస్యల పరిష్కారానికి సమావేశం కావడం లేదని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సకాలంలో వర్షాలు పడక రైతాంగం ఇక్కట్లు పడుతుంటే కరువు మండలాలను ప్రకటించాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేదని, గడచిన 4 ఏళ్ల కాలంలో కెసి కెనాల్ ఆయకట్టు పరిధిలో ఒక్కసారి కూడా రెండు పంటలు వేసేలా నీటిని విడుదల చేయలేదన్నారు. ప్రజా సంకల్పయాత్ర లో భాగంగా ఆదివారం సాయంత్రం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 85 శాతం పనులుపూర్తి అయిన పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ రైతులను అగచాట్లకు గురి చేస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కంటే, వాటిద్వారా వచ్చే లంచాలకే చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గండికోట, సర్వారాయ పేట వంటి ఏప్రాజెక్టు తీసుకున్నా నీళ్లిచ్చే స్థితే లేదన్నారు. కెసి కెనాల్ నుంచి ఆగస్టు 20 వతేదీ కల్లా నీటిని విడుదల చేయాల్సి ఉన్నా, దాదాపు నవంబరు 20 నాటికి నీళ్లిస్తున్నారంటనే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో స్పష్టం అవుతోందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన పాదయాత్రలో భాగంగా పంటపొలాల్లో ఇప్పుడు నాట్లు వేయడాన్ని గమనించానని, రైతుల కడగండ్లకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించదు, పేదలు, విద్యార్దులు, ముసలి వయసులో ఉన్న అవ్వా తాతల గురించి పట్టించుకోదంటూ విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక చేనుల్లోనూ, రోడ్లపైనా దిగుబడులను పారబోస్తున్న రైతన్నల దారుణ స్థితి గురించి ప్రభుత్వం ఏనాడు ఆలోచించలేదన్నారు. 


రాజోలు ప్రాజెక్టు కోసం దివంగత మహా నాయకుడు రూ.630 కోట్లు మంజూరు చేస్తే, ఇంతవరకు దాని గురించి పట్టించుకనే వారు కరువయ్యారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రాజోలు ప్రాజెక్టును చేపట్టి, పూర్తి చేసి చూపిస్తామని ప్రకటించారు. 

ఎన్నికలకు ముందు ప్రతి సామాజికవర్గాన్ని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా మోసం చేశారన్నారు. రుణమాఫీ చేస్తాని, బ్యాంకుల్లో తనఖాలో ఉన్న బంగారాన్ని ఇంటికితీసుకుని వస్తానని చెప్పిన దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికి కూడా బ్యాంకు నుంచి బంగారం ఇంటికి రాలేదన్నారు. రుణమాఫీ కాక రైతులు అల్లాడి పోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న దురదృష్టకర వాతావరణముందన్నారు. చేనేతల  పరిస్థితికి రోజురోజుకు దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాక మునుపు రేషన్ షాపుల నుంచి వచ్చే సరుకులను కూడా తగ్గించి కేవలం బియ్యానికి మాత్రమే కార్డులను పరిమితం చేశారన్నారు. ఇలాంటి మోసపూరితమైన రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రేపటి గురించి భరోసా కల్పించేందుకే తాను పాదయాత్ర చేపట్టానని పేర్కొన్నారు. 


చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్ధం తీసుకురావాలి. లేకుంటే చంద్రబాబు నాయుడి లాంటి వారు ప్రతి ఇంటికి మారుతి కారు ఇస్తానంటారు, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని కూడా హామీ ఇస్తారు. ఇలాంటి వ్యవస్థలు మారాలి, రాజకీయా నాయకులు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే రాజీనామా చేసే పరిస్థితి రావాలి అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 


మూడువేల కిలోమీటర్ల మేర సాగే తన పాదయాత్రలో ప్రతి ప్రతి సామాజికన వర్గాన్ని కలుసుకుంటానని, ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తానని, ఆ సమయంలో తనకు  సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ప్రకటించిన నవ రత్నాల్లో కూడా ఏదైనా మంచి చేయడం కోసం మార్పుల కోసం  సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ విధంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు సూచనలతోనే 2,3 పేజీల్లో ఎన్నికల మానిఫెస్టోను రూపొందిస్తామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడి లాగా మేనిఫెస్టోను దాచిపెట్టమని, ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. 2014 ఎన్నికలసందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోను ఇంటర్ నెట్ నుంచి కూడా తీసేసారంటేనే చంద్రబాబు నైజాన్ని అర్ధం చేసుకోవచ్చన్నారు. అది కనిపిస్తే, అందులోని అంశాలపై ప్రజలు నిలదీసి కొడతారనే భయంతోనే దాచిపెట్టారన్నారు. 

తాము మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటితోపాటు, ఇవ్వని అంశాలను కూడా అమలుచేసి ప్రజల ముందుకు ధైర్యంగా వెళతామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తన పాదయాత్రలో అడుగడుగునా వెన్నంటి ఉంటున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య