• YSRCP DMW, Vuyyuru Town

అభిమానం 'అనంతం'


- అనంత‌పురం జిల్లాలో దిగ్విజ‌యంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

- రాజ‌న్న బిడ్డ‌పై అమిత‌మైన అభిమానం చూపుతున్న జిల్లా వాసులు

-  జ‌న‌నేత‌ను తరిమెలకు తీసుకొచ్చేందుకు పెన్నాలో మట్టిరోడ్డు నిర్మాణం

- 400 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిన వైయ‌స్ జ‌గ‌న్‌


అనంత‌పురం: ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర చేస్తుంటే.. ఉత్తర గోగ్రహణమే గుర్తుకొస్తోంది. ఆ పాద ధూళి.. ఆ మొండి ధైర్యం.. కౌరవ సేనమీదకు అర్జునుడెళ్తున్నట్టుగా ఉంది. జన సమూహంతో కలిసి జ‌న‌నేత అలుపెర‌గ‌ని యోధుడిలా ముందుకు సాగుతున్నారు. న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకొని గ‌త నాలుగు రోజులుగా అనంత‌పురం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ముంద‌కు సాగుతున్నారు. రాజ‌న్న బిడ్డ త‌మ క‌ష్టాలు తెలుసుకునేందుకు వ‌చ్చార‌ని అనంత‌పురం జిల్లా వాసులు అంతులేని అభిమానం చూపుతున్నారు. గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ప‌లికి, బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పూల‌బాట‌లు వేస్తున్నారు.  ‘జై జగనన్నా...’ అంటూ జేజేలు పలికే వాళ్లను చూస్తుంటే యుద్ధంలో విజయం సాధించే వాళ్ల కేరింతల్లా ఉన్నాయి. అభిమానులు.. కష్టాలు తీర్చమంటూ అర్జీలిచ్చేవాళ్లు.. ఏ దిక్కూలేక జననేతను ఆశ్రయించే వాళ్లు.. పాలకుల తీరుతో నష్టపోయి, పట్టరాని కోపంతో ఊగిపోయే వాళ్లు.. వివిధ వర్గాల వారు.. వెంట నడిచే నేతలకు భోజన సామగ్రి, వసతి టెంట్లు.. తదితరాలను చూస్తుంటే అలుపెరగని సైన్యం దండయాత్ర కెళ్తున్నట్టు కన్పిస్తోందని పలువురు వృద్ధులు చర్చించుకున్నారు. 


సారథి కోసం వారధి...

తరిమెల నుంచి చిట్టూరు వెళ్లాలంటే ఓ ప్రయాస. దాదాపు 4 కిలోమీటర్ల ఈ దారి కేవలం కాలిబాట. పగటి సమయంలో మాత్రమే కాస్త కష్టపడుతూ వెళ్లొచ్చు. మధ్యలో పెన్నానది. ఇక్కడ ఇసుకలోనే నడవాలి. వైయ‌స్ జగన్‌ ఇలాంటి దారిలో నడుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకున్నారు. చుట్టు పక్కల ప్రజలకు ఈ విషయం తెలిసింది. అంతే.. ఆయనెలా ఈ దారిలో నడుస్తారు. కంప.. కట్టెలు.. రాళ్లు.. మట్టి.. ఇసుక.. చిట్టూరు, తరిమెల ప్రజలు ఏకమయ్యారు. ఇంటికొకళ్లు వెళ్లి కేవలం మూడు రోజుల్లో ఆ నాలుగు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించారు. ఆఖరుకు పెన్నా నది మీద కూడా కొద్దిపాటి వారధి కట్టి తమ సారథిని నడిపించుకున్నారు. దీంతో ఇపుడు కాలి నడక కూడా కష్టమైన ఆ దారిలో అన్ని వాహనాలు వెళ్తున్నాయి.


400 కిలోమీట‌ర్లు పూర్తి

ప్ర‌జా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 400 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని గొడిగ‌నూరులో వంద కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిన వైయ‌స్ జ‌గ‌న్ అదే జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం ముద్దవ‌రం గ్రామంలో 200 కిలోమీట‌ర్లు, ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని బి.అగ్ర‌హారంలో 300 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు. ఇవాళ అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో 400 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు.  వైయ‌స్ జగన్‌ కోసం గ్రామస్తులు దారి పొడవునా బంతిపూలు పరిచారు. గ్రామానికి చేరుకోగానే మహిళలు హారతిఇచ్చారు. కొందరు వృద్ధులు ‘నాయనా! కాళ్లకు బొబ్బలు వచ్చాయంట కదా!’ అంటూ కిందకు వంగి కాళ్లు చూసే ప్రయత్నం చేశారు. ‘ఏం పర్వాలేదవ్వా!’ అంటూ వారిని వైయ‌స్ జగన్‌ అక్కున చేర్చుకున్నారు. దారిపొడువునా స‌మ‌స్య‌లు వింటూ ప్ర‌తి ఒక్క‌రికి భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య