వై.యస్.ఆర్ వాహన మిత్ర


  • నాడు పాదయాత్రలో మాట ఇచ్చిన చోటే పథకాన్ని ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

  • ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల చొప్పున సాయం

నేను చూశాను.. నేను విన్నాను..నేను ఉన్నాను అనే మాటకు కట్టుబడి, చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ తేది: 04-10-2019 న ఏలూరులో ప్రారంభించారు. మాట ఇచ్చిన చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం విశేషం. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్‌ జగన్‌ ఏలూరులో జరిగిన బహిరంగ సభలో​ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్‌, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వైఎస్సార్‌ వాహన మిత్ర ప్రారంభం సందర్భంగా కృతజ్ఞతగా సీఎం వైఎస్‌ జగన్‌తో చేతులు కలిపిన ఆటో డ్రైవర్లు

ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున ఐదేళ్ల పాటూ ఒక్కొకరు రూ. 50 వేలు నగదును అందుకోనున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతీ అర్హుడికి ఈ పథకం అందేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.


‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకంతో తమకు చేయూతనిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆటో డ్రైవర్లు పుష్ప గుచ్ఛాలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి ఈ పథకం ప్రారంభించినందకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


158 views0 comments

Recent Posts

See All