జగనన్న అమ్మ ఒడి

Updated: Jul 15, 2020


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ ‌రెడ్డి మరో చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీని.. యాత్ర పూర్తై ఏడాది పూర్తి చేసుకున్న రోజే నెరవేర్చారు. ఈ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్. పాదయాత్రలో అమ్మల కష్టాన్ని చూశానని.. పిల్లల చదువులు భారం కాకూడదని ప్రతి అక్క, చెల్లెమ్మలకు మానసిక సంఘర్షణ ఉండేదన్నారు. ఆ తల్లులకు, పిల్లలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.


చదువు పిల్లలకు గొప్ప ఆస్తి, సంపద అన్నారు ముఖ్యమంత్రి జగన్. ప్రతి ఒక్కరికి విద్య ఓ హక్కని.. పేదింటి పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడగలగాలి.. అందుకే తల్లలుకు చేయూత కోసం అమ్మ ఒడిని ప్రారంభించామని చెప్పారు. 75శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని సీఎం తెలిపారు.. మేనిఫెస్టోలో 1 నుంచి 10 తరగతి వరకే అని చెప్పాం.. కానీ 1 నుంచి ఇంటర్ వరకు అమలు చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నామన్నారు.


పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని గర్వంగా చెబుతున్నాను అన్నారు. తెలుగు సబ్జెక్ట్‌ను కూడా తప్పనిసరి చేశామని.. ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు 'నాడు-నేడు' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అన్ని కాలేజీ, స్కూళ్ల రూపు రేఖల్ని పూర్తిగా మార్చేస్తామని.. స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ‘జగనన్న గోరు ముద్ద’ ప్రథకానికి శ్రీకారం చుట్టామన్నారు.


‘జగనన్న గోరు ముద్ద’ మెనూ

  • సోమవారం - అన్నం, పప్పుచారు, ఎగ్, స్వీట్

  • మంగళవారం - పులిహోర, టమోటో పప్పు, ఉడికించిన గుడ్డు

  • బుధవారం - వెజిటుబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్

  • గురువారం - కిచిడీ, టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు

  • శుక్రవారం - అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్

  • శనివారం - అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్

జగనన్న అమ్మఒడి కింద పిల్లలను బడులకు పంపే ప్రతి తల్లికీ ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందజేయనుంది. ఈ పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడిలో లబ్ధి చేకూరుతోంది. పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు.. జూనియర్ కాలేజీల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు.


  • జగనన్న అమ్మ ఒడికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

గ్రామ, వార్డు వలంటీర్లకు పిల్లల విద్యాభ్యాస వివరాలు, తల్లి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. వాళ్లే గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లయ్ చేస్తారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వలంటీర్లను అప్రమత్తం చేస్తుండాలి.


  • జగనన్న అమ్మ ఒడి డబ్బు జమ చేశారో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?

తల్లులు తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పించింది. జగనన్న అమ్మ ఒడి వెబ్‌సైట్‌ (http://jaganannaammavodi.ap.gov.in/) లోకి వెళ్ళి.. ఆ తర్వాత అక్కడ కనిపించే CLICK HERE FOR SEARCH CHILD DETAILS FOR AMMAVODI SCHEME మీద క్లిక్ చేయాలి. అక్కడ సంబంధిత తల్లి/సంరక్షకుల ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే డబ్బులు అకౌంట్‌లో జమయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.

202 views0 comments

Recent Posts

See All